iDreamPost
android-app
ios-app

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ సీజన్ 3 వచ్చేస్తుంది.. కానీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం చిన్న ట్విస్ట్!

  • Published May 30, 2024 | 4:21 PM Updated Updated May 30, 2024 | 4:21 PM

ఈ మధ్య కాలంలో ఓటీటీ లో కొత్త కంటెంట్ వస్తున్న మాట వాస్తవమే. అయితే దానికి తగిన ప్రమోషన్స్ కూడా సరికొత్త గానే చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఓ వెబ్ సిరీస్ కు సంబంధించిన కొత్త సీజన్ ను సరికొత్తగా అనౌన్స్ చేశారు మేకర్స్. అదేంటో చూసేద్దాం.

ఈ మధ్య కాలంలో ఓటీటీ లో కొత్త కంటెంట్ వస్తున్న మాట వాస్తవమే. అయితే దానికి తగిన ప్రమోషన్స్ కూడా సరికొత్త గానే చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఓ వెబ్ సిరీస్ కు సంబంధించిన కొత్త సీజన్ ను సరికొత్తగా అనౌన్స్ చేశారు మేకర్స్. అదేంటో చూసేద్దాం.

  • Published May 30, 2024 | 4:21 PMUpdated May 30, 2024 | 4:21 PM
Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ సీజన్ 3 వచ్చేస్తుంది.. కానీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం చిన్న ట్విస్ట్!

ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది. చాలా మంది ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లను చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనితో మేకర్స్ కూడా.. కొన్ని పాపులర్ వెబ్ సిరీస్ లకు వరుస సీజన్స్ ను ప్రకటిస్తున్నారు. ఇంకా దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా సరికొత్తగా చేస్తున్నారు. మారుతున్న ఓటీటీ ల ట్రెండ్ కు తగినట్టుగానే మేకర్స్ కూడా అటు కంటెంట్ లోను ఇటు ప్రమోషన్స్ లోను కొత్తదనం కనబరుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాగా పాపులర్ అయినా ఓ వెబ్ సిరీస్ కు కొత్త సీజన్ ను ప్రకటించారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి విషయాలను చూసేద్దాం.

ఇటీవల పంచాయత్ సీజన్ 3 కు సంబంధించిన అప్ డేట్ ను ఏ విధంగా అనౌన్స్ చేశారనేది తెలియనిది కాదు. ఇక ఇప్పుడు ఇదే తరహాలో మరొక సిరీస్ రాబోతుంది. అదే కోట ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ సీజన్ 3. అయితే ఈ సిరీస్ జూన్ లో వస్తుందని అయితే అనౌన్స్ చేశారు కానీ.. డేట్ ఎప్పుడు అనేది మాత్రం ప్రేక్షకులకే వదిలేశారు. అంటే ప్రేక్షకులే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అదెలా అంటే.. మేకర్స్ ఈ సిరీస్ ప్రమోషన్ వీడియోలో ఓ మ్యాథ్స్ పజిల్ ను ఇచ్చారు. దానిని సాల్వ్ చేస్తే ఈ సరికొత్త సీజన్ ఎప్పుడు వస్తుంది అనేది గెస్ చేసేయొచ్చట. దీనితో ఇలాంటి పజిల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారు దీనికి సమాధానం వెతకడం మొదలు పెట్టారు. ఆ పజిల్ కు సమాధానం 20 అని వచ్చిందట. అంటే జూన్ 20 న ఈ సిరీస్ రానుందని అంటున్నారు. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Kota Season

ఈ కోట ఫ్యాక్టరీ మొదటి రెండు సీజన్స్ కూడా .. నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆదరణ పొందాయి. దీనితో ఇప్పుడు ఈ సిరీస్ కు కొత్త సీజన్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సీజన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎక్కడా తక్కువ చేయదని చెప్పడంలో ఏ సందేహం లేదు. అసలు ఏంటి ఈ కోట ఫ్యాక్టరీ సిరీస్ అనే విషయానికొస్తే.. ఇది ఐఐటీ ఆస్పిరెంట్స్ చుట్టూ తిరిగే కథ. రాజస్థాన్ లోని కోట ఐఐటీలలో సీటు సాధించడం కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ కోచింగ్ కు పెట్టింది పేరు. అయితే అక్కడ కోచింగ్, ర్యాంకుల వెనుక పరుగులు ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు. సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. దీనిని ప్రశ్నిస్తూనే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడాల్సిన సిరీస్ ఇది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019 లో వచ్చింది. ఇక రెండవ సీజన్ 2021 లో వచ్చింది. ఇక ఈ ఏడాది మూడవ సీజన్ రాబోతుంది.ఇప్పటివరకు మొదటి రెండు సీజన్స్ చూడని వారు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.