Swetha
OTT Thriller Drama Jama Movie: థియేటర్ లో రిలీజ్ అయినా నెలకే ఓటీటీ లోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ కు ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. ఇక ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ను సర్ప్రైజ్ చేసేలా.. పది ఇరవై రోజులకే ఓటీటీ లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది.
OTT Thriller Drama Jama Movie: థియేటర్ లో రిలీజ్ అయినా నెలకే ఓటీటీ లోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ కు ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. ఇక ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ను సర్ప్రైజ్ చేసేలా.. పది ఇరవై రోజులకే ఓటీటీ లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది.
Swetha
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు ఆదరణ పెరుగుతున్న మాట వాస్తవమే. అయితే తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా కథలను బట్టి ఓటీటీ లో అన్ని భాషల సినిమాలకు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. కాబట్టి ఓటీటీ లోకి వచ్చిన ప్రతి సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు చాలా వరకు సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెలకే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ పద్దతికి ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. ఇక ఇప్పుడు వారిని మరింత సర్ప్రైజ్ చేసేలా.. థియేటర్ లో రిలీజ్ అయినా పది , ఇరవై రోజులకే సినిమాలు ఓటీటీ లోకివచ్చేస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ థియేటర్ లో రిలీజ్ అయినా వారం రోజుల్లోనే.. ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా మరేదో కాదు కోలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయినా తమిళ మూవీ.. ‘జామా’. ఈ సినిమాకు పరి ఎలవజగన్ దర్శకత్వం వహిస్తూ.. హీరోగా నటించాడు. అటు హీరోగాను , దర్శకుడిగానూ ఇదే అతని మొదటి సినిమా కావడం విశేషం. ఆగష్టు 2 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. కథ, నటన , స్క్రీన్ ప్లే ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులను మెప్పించినా కూడా కమర్షియల్ పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా.. సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ మూవీ తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.
ఇక జామా మూవీ కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా ప్రాచీనమైన జానపద కళ తేరుకూత్తు నేపథ్యంలో కొనసాగుతూ ఉంటుంది. కళ్యాణం అనే వ్యక్తి తండ్రి ఈ తేరుకూత్తు కళలో గొప్ప పేరు సంపాదిస్తాడు. అయితే తండ్రి బాటలోనే అతను కూడా వెళ్లాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే రామచంద్ర నాటక సభలో జాయిన్ అయ్యి.. ఆ గ్రూప్ సభ్యులు వేసే నాటకాల్లో ఆడవేషాలు వేస్తుంటాడు. క్రమ క్రమంగా ఆ ఆడవేషాల వలన.. అతని మాట , నడక తీరు మొత్తం అన్నీ మారిపోతాయి. ఆ తర్వాత ఏమైంది? అతను తండ్రి అనుకున్న కళను సాధిస్తాడా లేదా ? అనేది మిగిలిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.