iDreamPost
android-app
ios-app

OTT లో తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసిన.. మతిపోగోట్టే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

  • Published Jul 24, 2024 | 1:53 PMUpdated Jul 24, 2024 | 1:53 PM

Shakahaari Telugu OTT Streaming : ఓటీటీ లో తెలుగు కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణ ను దృష్టిలో ఉంచుకుని.. ముందు ఒరిజినల్ భాషలో కొన్ని సినిమాలను రిలీజ్ చేసినా కానీ.. ఆ తర్వాత వాటిని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Shakahaari Telugu OTT Streaming : ఓటీటీ లో తెలుగు కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణ ను దృష్టిలో ఉంచుకుని.. ముందు ఒరిజినల్ భాషలో కొన్ని సినిమాలను రిలీజ్ చేసినా కానీ.. ఆ తర్వాత వాటిని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

  • Published Jul 24, 2024 | 1:53 PMUpdated Jul 24, 2024 | 1:53 PM
OTT లో తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసిన..  మతిపోగోట్టే  మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

చిన్న చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద.. ఊహించని బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కన్నడలోను ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఇక ఆ తర్వాత ఆయా సినిమాలు థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని.. ఓటీటీ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదట ఓటీటీ లో కేవలం ఒరిజినల్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఓటీటీ లో తెలుగు కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ముందు ఒరిజినల్ భాషలో ఆయా సినిమాలు రిలీజ్ చేసిన కానీ.. ఆ తర్వాత తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. , మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఏడాది క్రితం కన్నడలో.. రంగాయ‌న ర‌ఘు లీడ్ రోల్‌లో నటించిన “శాఖాహారి” మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయినా ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఇక ఆ తరువాత రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది కానీ అప్పుడు కేవలం.. కన్నడలో మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు తెలుగు కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో.. శాఖాహారి మూవీ తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పటివరకు ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను ఎవరు చూసి ఉండకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక శాఖాహారి సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా స్టోరీ లైన్ కాస్త కొత్తగా ఉంటుంది. సుబ్బన్న అనే వ్యక్తి ఓ చిన్న హోటల్ లో శాఖహర హోటల్ నడుపుతూ ఉంటాడు. అతనికి ఇంకా పెళ్లి అవ్వదు. ఎలాంటి రిలేషన్స్ లేకుండా ఒంటరిగా జీవితాన్నిగడపాలని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అతని జీవితంలోకి వినయ్ అనే వ్యక్తి ఎంటర్ అవుతాడు, అతను అప్పటికే తన భార్యను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉంటాడు. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకుని.. అతని సుబ్బన్న హోటల్ లో తలదాచుకుంటాడు. దీనితో వినయ్ ను వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకు.. విచిత్రంగా సుబ్బన్న గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. సుబ్బన్న గురించి పోలీసులకు తెలిసిన విషయాలు ఏంటి ? సుబ్బన్నకు గతంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా ? వినయ్ తన భార్యను ఎందుకు హత్య చేస్తాడు ?ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి