iDreamPost

OTT Movies : ఒకే వారంలో డైరెక్ట్ OTT లోకి రెండు స్పెషల్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jul 02, 2024 | 5:34 PMUpdated Jul 02, 2024 | 5:34 PM

Direct OTT Releases : థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి వచ్చినపుడు ఉండే ఇంట్రెస్ట్ కంటే కూడా.. నేరుగా ఓటీటీ లో వచ్చే సినిమాలకు క్రేజ్ బాగా పెరుగుతుంది. మరి ఈ క్రమంలో ఈ నెలలో డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే రెండు సినిమాలేంటో చూసేద్దాం.

Direct OTT Releases : థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి వచ్చినపుడు ఉండే ఇంట్రెస్ట్ కంటే కూడా.. నేరుగా ఓటీటీ లో వచ్చే సినిమాలకు క్రేజ్ బాగా పెరుగుతుంది. మరి ఈ క్రమంలో ఈ నెలలో డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే రెండు సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Jul 02, 2024 | 5:34 PMUpdated Jul 02, 2024 | 5:34 PM
OTT Movies : ఒకే వారంలో డైరెక్ట్ OTT లోకి రెండు స్పెషల్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రతి వారం కొత్త కంటెంట్ తో సినిమాలను, సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంది. ఓటీటీ లోకి ఎలాంటి కంటెంట్ వచ్చిన కానీ.. దాదాపు ఆయా సినిమాల కథను బట్టి ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయినప్పుడు ఉండే ఇంట్రెస్ట్ కంటే కూడా.. డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలకు, సిరీస్ లకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలకు బాగానే ఆదరణ లభించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఒకే వారంలో రెండు సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

కాకుడ :

హర్రర్ మూవీస్ ని ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడుతున్నారో తెలియనిది కాదు. దీనితో కొత్త కాన్సెప్ట్ తో ఈ హర్రర్ మూవీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ముంజ్యా మూవీ.. థియేటర్స్ లో ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ముంజ్యా మూవీ డైరెక్టర్ తీసిన మరొక మూవీ “కాకుడ”. అయితే ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయకుండా.. డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీలో రితేశ్ దేశ్‍ముఖ్, సోనాక్షి సిన్హా, షకీబ్ కలీం తో పాటు.. ఆసిఫ్ ఖాన్, సచిన్ వినోద్, అరుణ్ దూబే, సూరజ్ రాజ్ మధ్వానీ ప్రధాన పాత్రలలో నటించారు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాటోడీ అనే గ్రామంలో.. సాయంత్రం 7గంటల 15 నిమిషాలకు ఊరిలో అందరి ఇళ్లకు ఉన్న ప్రత్యేకమైన చిన్న డోర్స్ ను తెరుస్తారు. ఆ తలుపు కానీ తెరవకపోతే.. కాకుడ వచ్చి ఆ ఇంట్లోని పురుషులకు హాని కలిగిస్తుందని ఊరిలో అందరూ భావిస్తారు. ఈ కాన్సెప్ట్ చుట్టూనే ఈ సినిమా స్టోరీ ఉండబోతుంది. ఇక ఈ సినిమా జులై 12 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కాబోతుంది. కాబట్టి ఎంచక్కా ఈ సినిమాను చూసేయండి.

వైల్డ్ వైల్డ్ పంజాబ్:

హర్రర్ సినిమాల తర్వాత ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది.. కామెడీ సినిమాలు. వైల్డ్ వైల్డ్ పంజాబ్ మూవీ కూడా ఓ కామెడీ మూవీనే. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. బ్రేక్ అప్ అయినా ఫ్రెండ్ కోసం తన మిగిలిన ఫ్రెండ్స్ అంతా కలిసి ఎలా తనని బయటకు తీసుకుని వచ్చారు అనే కాన్సెప్ట్ పైన ఈ మూవీ ఉండబోతుంది. ఖాన్నే అనే అతనికి.. బ్రేక్ అప్ అవ్వడంతో బాధలో ఉంటాడు. అయితే అతనిని మళ్ళీ ఆనందంగా ఉంచడం కోసం తన ఫ్రెండ్స్ అంత కలిసి.. ట్రిప్ కు వెళ్లాలని డిసైడ్ అవుతారు. అందుకోసం పఠాన్‍కోట్‍కు స్టార్ట్ అవుతారు. ఆ జర్నీలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేదే ఈ మూవీ కథ.

ఈ సినిమాలో వరుణ్ శర్మ, సన్నీ సింగ్, మనోజ్ సింగ్, జెస్సీ గిల్ ల తో పాటు.. పత్రలేఖ, ఇషితా రాజ్ లు మెయిన్ రోల్స్ లో నటించారు. ఇక ఈ సినిమా జులై 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ సినిమాను కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి