iDreamPost
android-app
ios-app

హాలీవుడ్ ఆల్ టైమ్ హిట్ యాక్షన్ చిత్రాలు తెలుగులో.. మీరు చూశారా?

Hollywood Action Movies In Telugu OTT: తెలుగు ఓటీటీలో ఎన్నో యాక్షన్ చిత్రాలు ఉన్నాయి. కాకపోతే అవన్నీ తెలుగు మూవీసే అనుకోవద్దు. హాలీవుడ్ కి చెందిన ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్షన్ చిత్రాలు కూడా తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Hollywood Action Movies In Telugu OTT: తెలుగు ఓటీటీలో ఎన్నో యాక్షన్ చిత్రాలు ఉన్నాయి. కాకపోతే అవన్నీ తెలుగు మూవీసే అనుకోవద్దు. హాలీవుడ్ కి చెందిన ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్షన్ చిత్రాలు కూడా తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

హాలీవుడ్ ఆల్ టైమ్ హిట్ యాక్షన్ చిత్రాలు తెలుగులో.. మీరు చూశారా?

ఓటీటీలు వచ్చిన తర్వాత ఏ సినిమాలు చూడాలి? ఎక్కడ చూడాలి? ఎలాంటి మూవీస్, వెబ్ సిరీస్లు చూడాలి? అనే ప్రశ్నలు వేసుకోవడమే ఎక్కువ అయిపోయింది. ఉన్న కాస్త సమయంలో ఏ సినిమా, వెబ్ సిరీస్ చూడాలి? అనే ప్రశ్నతోనే సమయం కాస్తా అయి పోతుంది. అందుకే మేము ఓటీటీ సజీషన్స్ రూపంలో మంచి మంచి సినిమాలను మీకు సజెస్ట్ చేస్తున్నాం. చాలామందికి యాక్షన్ చిత్రాలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. కానీ, భాషా అడ్డంకి వల్ల వారి ఇష్టాన్ని కాస్తా పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వాళ్లు యాక్షన్ చిత్రాలు తెలుగులో ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు. అలాంటి వారి కోసం ఓటీటీల్లో తెలుగులోనే చాలా యాక్షన్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. చాలామంది వాటి గురించి తెలియక చూడట్లేదు. అందుకే మీకోసం తెలుగులో ఉన్న యాక్షన్ చిత్రాలను తీసుకొచ్చాం. అది కూడా ఆల్ టైమ్ ఫేవరెట్స్ అవి.

సాధారణంగా హాలీవుడ్ చిత్రాలు అంటే వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ఉంటారు. ముఖ్యంగా యాక్షన్ చిత్రాలు అంటే పడి చచ్చిపోతారు. కాకపోతే అవి ఎక్కువ ఇంగ్లీష్ లోనే ఉంటాయని చాలామంది వాటిని చూడరు. తెలుగులో ఉంటే బావుంటుంది కదా అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఓటీటీలు వచ్చిన తర్వాత ఎంతో ఊరట లభించింది అనే చెప్పాలి. అయితే చాలా మంది ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న తెలుగు యాక్షన్ చిత్రాల గురించి పట్టించుకోవడం లేదు. అంటే హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ చిత్రాలు తెలుగులోనే అందుబాటులో ఉంటున్నాయి.

హాలీవుడ్ నుంచి కొత్తగా వచ్చే యాక్షన్ చిత్రాలు మాత్రమే కాకుండా.. గతంలో విడుదలైన బెస్ట్ యాక్షన్ చిత్రాలు కూడా ఇప్పుడు తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కూడా ఎవర్ గ్రీన్ హాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీస్ ఉండటం విశేషం. మీరు వీటిని ఇప్పటికే ఇంగ్లీష్ లో చూసుంటారు. కానీ, మరోసారి తెలుగు డబ్బింగ్ లో.. అది కూడా ఓటీటీలో చూస్తే సూపర్ ఉంటుంది. ఇలాంటి యాక్షన్ చిత్రాలు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. పదికి పైగా వింటేజ్ హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు ఆహా ఓటీటీలో తెలుగులో ఉన్నాయి.

ఆ యాక్షన్ చిత్రాల్లో మరీ ముఖ్యంగా ‘మెన్ ఇన్ బ్లాక్: ది ఇంటర్నేషనల్, రెసిడెంట్ ఈవి, టెర్మినేటర్ 3, డోంట్ బ్రీత్, జుమాంజీ, వెనం, XXX, అండర్ వరల్డ్, 2012, అమేజింగ్ స్పైడర్ మ్యాన్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2, స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్, ది ఇన్ ట్రూడర్, అనకొండ’ వంటి సూపర్ డూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు తెలుగులో ఉన్నాయి. మరి మీరు ఈ చిత్రాలను మిస్ అయితే ఒకసారి తెలుగులో చూసేయండి. ఇప్పటికే మీరు ఈ చిత్రాలను చూసి ఉంటే.. మీకు నచ్చిన బెస్ట్ యాక్షన్ చిత్రం ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBankobet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel