Swetha
Godzilla x Kong The New Empire OTT: సినిమాలంటే హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కథను బట్టి అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలుగు వారు సైతం ఎదురుచూసే ఓ హాలీవుడ్ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.
Godzilla x Kong The New Empire OTT: సినిమాలంటే హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కథను బట్టి అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలుగు వారు సైతం ఎదురుచూసే ఓ హాలీవుడ్ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.
Swetha
ఓటీటీ లో ఎన్ని సినిమాలు వస్తున్నా కానీ ప్రేక్షకులు మాత్రం కేవలం కొన్ని సినిమాలను చూసేందుకు ఎంతో ఇష్టపడుతుంటారు. అందులోను తెలుగు వారు సైతం వెయిట్ చేసే హాలీవుడ్ సినిమాలు ఇంకాస్త ప్రత్యేకం. అవే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన గాడ్జిల్లా, కాంగ్ చిత్రాలు. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అనే చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. దీనికి లభించిన ఆదరణతోనే.. ఈ ఏడాది మార్చి 29 వ తేదీన.. “గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్” అనే సినిమాను థియేటర్ లో రిలీజ్ చేశారు మేకర్స్ . దీనితో ఈ సినిమాకు కూడా ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు.. ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.
“గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్” సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే.. కలెక్షన్స్ విషయంలో దూసుకుపోయింది. పైగా థియేట్రికల్ రన్ పూర్తయ్యే సమయానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ ను సాధించింది. అయితే ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్.. ఎందుకంటే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. పైగా ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు.. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కూడా అందుబాటులోకి రానుంది. కానీ, ఇక్కడ ప్రేక్షకులకు కాస్త నిరాశ పడే విషయం ఒకటి ఉంది. ఈ సినిమా ఓటీటీ లోకి అయితే వస్తుంది. కానీ అది రరెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి కాకుండా మూవీ టికెట్స్ బుక్ చేసుకునే.. బుక్ మై షో లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. పైగా దీనికోసం భారీగా చెల్లించాలి ఉంది కూడా.. ఈ మూవీ ని కొనాలంటే రూ.799 ఖర్చులు చేయాల్సి ఉంది. ఈ మూవీని కొనుగోలు చేసినా.. మొబైల్, ఆండ్రాయిడ్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ, యాపిల్ టీవీ , ఫైర్ టీవీల్లో చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ సినిమా థియేటర్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐమ్యాక్స్ 3డీ వెర్షన్ తోపాటు 4 డీఎక్స్ , 3డీ ,2 డీ వెర్షన్స్ లో కూడా ఈ సినిమాను చూడొచ్చు.
అయితే ఈ సినిమా ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ వారమే ఓటీటీ లోకి రానుంది.. అమెజాన్ ప్రైమ్ తో పాటు యూట్యూబ్ లో మే 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమాకు 15 కోట్ల డాలర్స్ భారీ బడ్జెట్ ను కేటాయించారు మేకర్స్. ఇక అందరు ఆశించిన విధంగానే ఈ సినిమా అదే రేంజ్ లో భారీ కలెక్షన్స్ ను కూడా సాధించింది. మొదటి వారంలోనే ఈ సినిమా రూ.37.6 కోట్లు వసూలు చేయడం విశేషం. మరి ఈ సినిమా ఓటీటీ లో కూడా అదే రేంజ్ లో టాక్ సంపాదించుకుంటుందని చెప్పడంలో.. ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.