Swetha
OTT Political Action Thriller In Telugu : ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ తో వస్తే.. కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మరొక సరికొత్త మూవీ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.
OTT Political Action Thriller In Telugu : ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ తో వస్తే.. కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మరొక సరికొత్త మూవీ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.
Swetha
ఈ వారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవుతున్నాయో.. వాటిలో చూడదగిన తెలుగు సినిమాలేంటో.. ఇంట్రెస్టింగ్ సినిమాలేంటో అనే లిస్ట్ అంతా కూడా ఇప్పటికే వచ్చేసింది. దీనితో మూవీ లవర్స్ కూడా వీకెండ్ కు ఏ మూవీస్ చూడాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఆల్రెడీ రాబోయే సినిమాలతో పాటు.. కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ.. ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
మే నెలలో దేశమంతటా కూడా ఎన్నికల హడావిడి నెలకొన్న సంగతి తెలియనిది కాదు. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రస్తావన ఎందుకు వచ్చింది అనే విషయానికొస్తే.. అదే ఎన్నికల సమయంలో.. కోలీవుడ్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు “ఎలక్షన్“. ఈ సినిమా మే 17 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ స్టోరీ ఏమై ఉంటుంది అనేది అందరు.. ఈజీగా గెస్ చేసేయొచ్చు. స్థానికంగా జరిగే ఎన్నికలు దాని చుట్టూ జరిగే రాజకీయం.. ఇలా అన్నిటి గురించి ఈ సినిమాలో ప్రస్తావించారు దర్శకులు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తమిళంతో పాటు.. తెలుగు, హింది, కన్నడ , మలయాళ భాషల్లో.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక ఎలక్షన్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రసిద్ధి చెందిన రాజకీయ పార్టీలో వ్యక్తి నల్లశివం. అతని కుమారుడు నదరాసన్. అయితే పార్టీలో ఎంతో నమ్మకస్తుడిగా, నిజాయితో ఉండే నల్లశివంను అందరు రాజకీయంగా బాగా ఉపయోగించుకుంటారు. కానీ అతని కష్టానికి తగిన గుర్తింపును మాత్రం ఇవ్వరు. ఇదే క్రమంలో పేరొందిన ఓ పెద్ద లీడర్ ఆ పార్టీని విడిచి వెళ్ళిపోతాడు. దీనితో నల్లశివంకు అతనికి మధ్య విభేదాలు ఏర్పడతాయి. వారిద్దరికీ ఈ విషయంలో చాలానే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో నల్ల శివంకు ఘోర అవమానం ఎదురౌతుంది. దీనితో తన తండ్రికి జరిగిన అవమానానికి సమాధానం చెప్పడం కోసం.. నదరాసన్ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ? తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా ? అసలు నదరాసన్ ఎన్నికలలో గెలిచాడా లేదా ? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి