Swetha
థ్రిల్లర్, క్రైమ్ సిరీస్ లను, సినిమాలను ఇష్టపడని వారు ఇప్పుడు ఎవరు లేరు. ఈ క్రమంలో ఇప్పటివరకు వచ్చిన అన్ని వెబ్ సిరీస్ లలో.. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ టాప్ 10 లో ఒకటిగా నిలుస్తుందని చెప్పి తీరాలి.
థ్రిల్లర్, క్రైమ్ సిరీస్ లను, సినిమాలను ఇష్టపడని వారు ఇప్పుడు ఎవరు లేరు. ఈ క్రమంలో ఇప్పటివరకు వచ్చిన అన్ని వెబ్ సిరీస్ లలో.. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ టాప్ 10 లో ఒకటిగా నిలుస్తుందని చెప్పి తీరాలి.
Swetha
ఈ మధ్య కాలంలో ఇలాంటి ఓ సిరీస్ రాలేదనే చెప్పి తీరాలి. ఇలాంటి ఓ సిరీస్ చూస్తే.. ఇప్ప్పటివరకు వచ్చిన అన్ని బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ఇది కూడా టాప్ 10 లో ఒకటిగా నిలుస్తుందని చెప్పి తీరాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది సిరీస్ లను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే సిరీస్ లలో ప్రతి ఎపిసోడ్ లోను ఊహించని ట్విస్ట్ లు, సస్పెన్స్ లు ఉంటున్నాయి. అంతే కాకుండా ఏదైనా ఓ సిరీస్ కు మంచి టాక్ వచ్చిందంటే.. మేకర్స్ కూడా ఆయా సిరీస్ లను కొనసాగిస్తూ సీజన్స్ ను కంటిన్యు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఇటువంటిదే. ఈ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ ను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటె మాత్రం.. ఓ వర్త్ వాచింగ్ సిరీస్ ను మిస్ అయినట్లే, మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సిరీస్ పేరు “ఇరు ధృవమ్”. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు వచ్చాయి. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ తో అరుణ్ ప్రకాష్, ప్రసన్న డైరెక్టర్స్ గా అందరికి పరిచయం అయ్యారు. సైకో కిల్లర్ , సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ ఇలాంటివి అన్నీ కలిపి ఒకటే సిరీస్ లో చూసేయొచ్చు. ఈ సిరీస్ 2019 లో విడుదలైంది.. సైకో కిల్లర్ స్టోరీస్ కామన్ అయినా కానీ, ఈ సిరీస్ లో స్క్రీన్ ప్లే ద్వారా ఆడియన్సు ను సీట్ ఎడ్జ్ లో కుర్చోపెట్టారని చెప్పి తీరాలి. అడల్ట్, హర్రర్ విజువల్స్ అయితే కనిపించవు కానీ, చూసేవారికి మాత్రం ఖచ్చితంగా తర్వాత ఏం జరుగుతుందా అనే ఆశక్తి కలుగుతుంది. అసలు ఈ సిరీస్ లో ఏముంది.. ఎందుకు ఈ సిరీస్ ను చూడాలి అనే విషయానికొస్తే..
ఈ సిరీస్ లో హీరో ఓ పోలీస్ ఆఫీసర్.. అతనికి ఓ అందమైన భార్య, కూతురు ఉంటారు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ రోజు అనుకోకుండా అతని భార్య కనిపించకుండా పోతుంది. ఆమె కోసం ఎంత వెతికినా కూడా ఆమె గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. దీనితో అతనే ఆమె భార్యను చంపేసి.. ఇలా అబద్దం చెప్తున్నాడనే పుకార్లు మొదలవుతాయి. మరో వైపు ఓ సీరియల్ కిల్లర్ మర్డర్స్ చేస్తుంటాడు. చంపిన తర్వాత ఆ డెడ్ బాడీస్ దగ్గర కొటేషన్స్ రాసి పెడుతూ ఉంటాడు. అతను మర్డర్స్ చేసి.. అలా స్లిప్స్ పెట్టడం వెనుక కారణం ఏంటి ! ఆ రెండిటికి ఉన్న సంబంధం ఏంటి ! ఈ పోలీస్ ఆఫీసర్ అతనిని ఎలా పట్టుకున్నాడు!. అతని భార్యకు ఏమైంది! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.