Swetha
OTT Movie Suggestion: హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉన్న వారికి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఎలాగూ నచ్చేస్తుంది. కానీ ఇష్టం లేని వాళ్లకు కూడా ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా హారర్ సినిమాలపైన ఇంట్రెస్ట్ కలుగుతుంది.
OTT Movie Suggestion: హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉన్న వారికి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఎలాగూ నచ్చేస్తుంది. కానీ ఇష్టం లేని వాళ్లకు కూడా ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా హారర్ సినిమాలపైన ఇంట్రెస్ట్ కలుగుతుంది.
Swetha
ఓటీటీ వరల్డ్ లో డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్స్ తో వేల సంఖ్యలో సినిమాలు ఉన్న మాట నిజమే. కానీ కొంతమంది మాత్రం హారర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఎంత భయం వేసినా సరే ఈ సినిమాలను చూడడం మాత్రం ఆపారు. అలాంటి ఈ ఎంగేజింగ్ మూవీ ని ఇప్పటివరకు చూడకపోయి ఉంటే మాత్రం.. ఓ మంచి హార్రర్ సినిమాను మిస్ అయినట్లే. ఎన్నో హర్రర్ సినిమాలను చూసి ఉంటారు కానీ ఇలాంటి ఓ హర్రర్ సినిమాను మాత్రం ఎప్పుడు చూసి ఉండరు. ఇక ఈ మధ్య భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు కాబట్టి.. ఈ సినిమాను కూడా చూసేయొచ్చు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
చాలా వరకు హారర్ సినిమాలలో దెయ్యాలు మనుషులలోకి ప్రవేశించడం, మనుషులను హింసించడం ఇలాంటివి చూసి ఉంటాం.. అలాగే దెయ్యలతో మాట్లాడడానికి, దెయ్యాలను పిలవడానికి ఎన్నో గేమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. కానీ అవన్నీ కాకుండా ఇది ఇంకాస్త డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. ఎలా అంటే.. ఇందులో ఏకంగా ఆత్మల చేయి పట్టుకుని మాట్లాగలిగే సరికొత్త గేమ్స్ ను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమా కథ ఓ పార్టీలో మొదలవుతుంది. అందులో కోల్ అనే వ్యక్తి తన తమ్ముడి కోసం వెతుకుతూ ఉంటాడు. చివరికి అతను కనిపిస్తాడు కానీ ఊహించని విధంగా.. పిచ్చిగా ప్రవర్తిస్తూ తనని తాను పొడుచుకుని చనిపోతాడు. కట్ చేస్తే ఇలా వరుస మరొక సంఘటన మియా, జేడ్ అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు, మియా ఎక్కువగా జేడ్ ఇంట్లోనే ఉంటుంది. ఓ రోజు జేడ్ తన క్లాస్ మెట్ షేర్ చేసిన ఓ వీడియో చూస్తుంది. అందులో ఓ అమ్మాయికి దెయ్యం పడుతుంది. ఓ గేమ్ ఆడడం ద్వారా ఇలా చేయొచ్చని తన ఫ్రెండ్ మియాతో చెప్తుంది. దాని కోసం ఓ ప్లేస్ కు వెళ్తారు. ఇక అసలు కథ అక్కడ మొదలవుతుంది.
ఆ గేమ్ ఆడడం కోసం మియానే ముందుకు వస్తుంది. ఆ గేమ్ రూల్ ఏంటంటే ఆ గేమ్ ఆడాలని అనుకునే వారు ఓ బొమ్మను చేతిలో పట్టుకుని ఉండాలి. వారి ముందు వెలిగించిన ఓ క్యాండిల్ ఉంటుంది. దెయ్యం వచ్చిన 90 సెకండ్ల తర్వాత తమ ముందున్న క్యాండిల్ ను ఆర్పేయాలి. ఒకవేళ ఇలా కనుక ఆర్పకపోతే దెయ్యాల లోకం నుంచి వచ్చిన ఆత్మ ఈ లోకంలోనే ఉండిపోతుంది. ఇక మియా ఈ గేమ్ స్టార్ట్ చేస్తుంది. ఊహించినట్లుగానే ఆ దెయ్యం మియాలో 90సెకెన్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది. ఆ ఆత్మ ఇంకా ఎంత మందిని బలి తీసుకుంది. ఆ ఆత్మలకు ఇంకా ఎంత మంది టార్గెట్ అవుతారు. ఇవన్నీ తెలియాలంటే “టాక్ టు మీ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాను కనుక చూడడం మిస్ అయితే.. వెంటనే చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.