Swetha
ఇప్పటి వరకు ఎన్నో హర్రర్ మూవీస్ చూసి ఉంటారు. దెయ్యాలు ఎక్కడైనా సరే భయపెడుతూ ఉంటాయి కానీ ప్రేమిస్తాయా.. అలాంటి ఓ కథను ఎప్పుడైనా చూసారా.. ఇప్పటివరకు ఇలాంటి కథను చూడకపోతే మాత్రం ఇప్పుడు చూసేయండి.
ఇప్పటి వరకు ఎన్నో హర్రర్ మూవీస్ చూసి ఉంటారు. దెయ్యాలు ఎక్కడైనా సరే భయపెడుతూ ఉంటాయి కానీ ప్రేమిస్తాయా.. అలాంటి ఓ కథను ఎప్పుడైనా చూసారా.. ఇప్పటివరకు ఇలాంటి కథను చూడకపోతే మాత్రం ఇప్పుడు చూసేయండి.
Swetha
హర్రర్ సినిమాలంటే వెన్నులో వణుకులు పుట్టించేలా. గుండెల దడ పెంచేలా ఉండాలని అప్పుడే ఆ కిక్ ఉంటుందని అనుకుంటూ ఉంటారు.. హర్రర్ మూవీ లవర్స్. కానీ హర్రర్ తో పాటు దెయ్యం కూడా రొమాన్స్ చేస్తే ఆ సినిమా ఇంకెలా ఉంటుంది. ఇలాంటి ఓ కథ ఉందని తెలుసా, అవును ఇది ఒక దెయ్యం ప్రేమ కథ. దెయ్యమంటే మామూలు దెయ్యం కాదు. కేవలం రాత్రి పూట మాత్రమే వచ్చి.. మనుషుల రక్తాన్ని పీల్చే ఓ పిశాచి. ఇందులో ప్రేమ ఎక్కడుంది అనుకుంటే పొరపాటే. అసలు ఏంటి ఈ కథ. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి సినిమ కూడా ఉందా.. ఈ విషయాలన్నీ చూసేయండి.
ఇదొక వెబ్ సిరీస్.. ఈ వెబ్ సిరీస్ పేరు “టూత్ పరి”. ఇది తెలుగు సిరీస్ అయితే కాదు కానీ.. తెలుగులో కూడా అందుబాటులో ఉంది, పైగా ఈ సిరీస్ లో నటించిన వారిలో సీనియర్ నటి రేవతి అందరికి పరిచయమే. ఆమె తప్ప మిగతా వాళ్లంతా కొత్తగా కనిపించినా కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ పరిచయం ఉన్న వారిలానే అనిపిస్తారు. మానవుల రక్తాన్ని పీల్చే దెయ్యం, ఓ మనిషిని ప్రేమిస్తే.. ఎలా ఉంటుంది అనేదే ఈ సిరీస్ కథ. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైతే మిస్ అయ్యి ఉంటె మాత్రం వెంటనే చూసేయండి. ఓ వైపు ప్రేమ, మరో వైపు పగ.. కాస్త కామెడీ, ఇంకాస్త సీరియస్, కొంచెం రొమాంటిక్ టచ్.. ఇలా అన్ని కలగలిపిన ఈ సిరీస్ ను మాత్రం అసలు మిస్ చేయకండి. అసలు ఏంటి ఈ సిరీస్ అనే విషయానికొస్తే..
ఈ సిరీస్ కథేంటంటే.. ఇది ఒక ప్రేమ కథ.. కానీ ఇద్దరి మనుషుల మధ్యన కాదు.. అలా అని ఇద్దరి దెయ్యాల మధ్య కూడా కాదు.. ఓ మనిషికి ఓ దెయ్యానికి మధ్య కథ.. నిజానికి ఇందులో దెయ్యాలన్నీ కూడా మంచివే.. పగలంతా ఓ అండర్ గ్రౌండ్ లో దాక్కుని.. రాత్రులు జనాల్లోకి వస్తాయి. జనాల్లోకి వచ్చినా కూడా వాటికి ఓ రూల్ ఉంటుంది. కేవలం తమకు కావాల్సిన కొంత రక్తాన్ని మాత్రమే సేకరిస్తాయి. పైగా వీటికి రక్తాన్ని అవసరమైన మేర సప్లయ్ చేసే సప్లయర్ కూడా ఒకరు ఉంటారు. ఆ రక్తం బోర్ కొట్టిన దెయ్యాలు మాత్రం సీక్రెట్ గా జనాల్లోకి వస్తాయి. అలా వచ్చిన ఓ దెయ్యం అనుకోకుండా తన పొడుగాటి దంతం.. అది దానికి రక్తాన్ని పీల్చడానికి అనువుగా వుండేది.. అలాంటిదాన్ని కోల్పోతుంది. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.
ఆ గ్లామరస్ దెయ్యం ఆ దంతాన్ని సరిచేసుకోవడం కోసం డెంటిస్ట్‌ని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో అతనితో ప్రేమలో పడుతుంది. ఇదిలా ఉండగా మరో వైపు ఖాట్మండూస్ అనే ఓ ముసలి టీం ఈ దెయ్యం ఫ్రెండ్ ను చంపేస్తుంది. ఆ ఖాట్మండూస్ టీం లీడర్ రేవతి. దీనితో తన ఫ్రెండ్ ని చంపేసిన వారిపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది ఈ దెయ్యం. ఓ వైపు ప్రేమ, ఇంకో వైపు పగ.. ఆ రక్త పిశాచి ప్రేమ గెలిచిందా ! ఆమె పగ తీరిందా ! అసలు డాక్టరుతో దెయ్యం ప్రేమలో పడడం ఏంటి ! దెయ్యలతో లవ్ ఎలా ఉంటుంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.