iDreamPost

OTT Best Horror Movie: హాలోవెన్ ఫెస్టివల్ చుట్టూ జరిగే హత్యలు.. OTTలో ఈ హర్రర్ మూవీ చూశారా?

  • Published May 28, 2024 | 7:17 PMUpdated May 28, 2024 | 7:17 PM

OTT Movie Suggestion: హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటె మాత్రం ఈ సినిమాను అసలు మిస్ కాకండి. పైగా ఇది ప్రతి ఏటా జరుపుకుని ఓ పండుగను ఆధారంగా రూపొందించిన సినిమా. మరి ఈ సినిమా మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటె మాత్రం ఈ సినిమాను అసలు మిస్ కాకండి. పైగా ఇది ప్రతి ఏటా జరుపుకుని ఓ పండుగను ఆధారంగా రూపొందించిన సినిమా. మరి ఈ సినిమా మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published May 28, 2024 | 7:17 PMUpdated May 28, 2024 | 7:17 PM
OTT Best Horror Movie: హాలోవెన్ ఫెస్టివల్ చుట్టూ జరిగే హత్యలు..  OTTలో ఈ హర్రర్ మూవీ చూశారా?

హారర్ సినిమాలు ఎన్ని చూసిన కానీ అసలు బోర్ కొట్టదు. ఈ జోనర్ లో అన్ని సినిమాలను చూసేశాం అనుకునే ప్రేక్షకులకు ఇంకా కొన్ని సినిమాలు మిగిలే ఉన్నాయని.. చెప్పడానికి ఈ మూవీ సజ్జెషన్. పైగా ఈ హర్రర్ మూవీ స్పెషాలిటీ ఏంటంటే.. ప్రతి ఏటా జరుపుకునే పండుగల నుంచి ఆధారంగా తీసుకుని రూపొందించిన సినిమా. మరి ఈ సినిమాను ఇప్పటివరకు మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి. మరి ఇంతకీ ఇది ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ట్రిక్ ఆర్ ట్రీట్.. ఈ పదాన్ని ఆల్రెడీ వినే ఉంటారు. మన దేశంలో ఫెస్టివల్స్ ఎలా జరుపుకుంటామో.. అలాగే బయట దేశాల్లో హాలోవెన్ డే ను ప్రతి సంవత్సరం అక్టోబర్ 30 న సెలెబ్రేట్ చేసుకుంటారు. అక్కడున్న ఆచారం ప్రకారం.. ఆరోజున మాత్రం మన లోకానికి ఆత్మల లోకానికి ఉండే కనెక్షన్ నశించిపోతుందట. ఆరోజు ఆత్మల ప్రపంచంలో ఉన్న ఆత్మలు అన్ని భూమి మీదకు వస్తాయట . అందుకోసమే భూమి మీద కూడా అందరూ దెయ్యాలలా డ్రెస్సింగ్ చేసుకుని.. అలానే ప్రవర్తిస్తారు. అలా డ్రెస్ చేసుకుని ఇంటి ఇంటికి తిరుగుతూ.. ట్రిక్ ఆర్ ట్రీట్ అనే ఓ చిన్న గేమ్ ను ఆడుతారు. ఇలాంటి ఓ హాలోవెన్ డే రోజున అసలు ఏం జరిగింది.. ఆత్మలు నిజంగానే భూమి మీదకు వచ్చాయా.. వచ్చి ఏం చేసాయి.

అసలు కథలోకి వెళ్తే.. హేమ, హెన్రీ అనే జంట హాలోవెన్ డే కోసం వాళ్ళ ఇంటిని హాలోవెన్ డే కోసం డెకరేట్ చేస్తూ ఉంటారు. కానీ హేమకు ఆ ఫెస్టివల్ సెలెబ్రేట్ చేయడం ఇష్టం ఉండదు. ఇంట్లో చేసిన డెకరేషన్స్ అన్ని చెడగొడుతూ ఉంటుంది. హెన్రీ మాత్రం డెకరేట్ చేస్తూనే ఉంటాడు. కట్ చేస్తే ఎదో వింత ఆకారం ఆమెను చంపేస్తుంది. ఆ అరుపులు విని హెన్రీ వచ్చి చూస్తే అక్కడ.. హేమ తల మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత చార్లీ అనే అబ్బాయి ఊరంతా తిరుగుతూ.. అందరి ఇంటి ముందు ఉన్న డెకరేషన్స్ ను పాడు చేస్తూ ఉంటాడు, ఎందుకంటే అతనికి కూడా ఆ ఫెస్టివల్ ఇష్టం ఉండదు. అలా వాళ్ళ ప్రిన్సిపల్ ఇంటి దగ్గరకు వెళ్తాడు.. అక్కడ కూడా అలానే పాడుచేయబోతుంటే.. వాళ్ళ ప్రిన్సిపల్ అతనిని లోనికి పిలిచి.. ఓ చాక్లేట్ ఇచ్చి దానిని తినమని చెప్తూ.. హాలోవెన్ డే గురించి చెప్తాడు. కట్ చేస్తే ఆ పిల్లవాడు రక్తం కక్కుకుని చనిపోతాడు.

ఆ ప్రిన్సిపల్ చార్లీ శవాన్ని పాతి పెట్టడానికి గార్డెన్ లోకి వెళ్తాడు.. కానీ అక్కడ కేవలం చార్లీ శవం మాత్రమే కాదు.. ఇంకా చాలా మంది చిన్న పిల్లల శవాలాన్ని ఉంటాయి. వీటి అన్నిటిని పై నుంచి తన కొడుకు, పక్క ఇంటి నుంచి క్రిగ్ అనే వ్యక్తి గమనిస్తూ ఉంటారు. ఆ ప్రిన్సిపల్ చార్లీ శవాన్ని పూడ్చి పెట్టి వెళ్ళేలోపు.. క్రిగ్ ను కూడా ఓ వింత ఆకారం చంపేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఓ అమ్మాయి తన ఫ్రెండ్స్ తో కలిసి.. అందరి ఇళ్లకు వెళ్లి ఆరోజు తయారు చేసే పంప్కిన్స్ ను కలెక్ట్ చేయాలనీ అనుకుంటుంది. అప్పటినుంచి ఆమెను ఆమె ఫ్రెండ్స్ ను కూడా ఏవో ఆత్మలు వేటాడుతూ ఉంటాయి. నిజంగానే ఆత్మలు వచ్చాయా ! వస్తే ఆ ఆత్మలు ఎవరివి ! ఎందుకని వారిని టార్గెట్ చేస్తాయి ! హాలోవెన్ ఇష్టం లేని వారిని ఎందుకు చంపుతాయి ! ఆ ప్రిన్సిపల్ ఎందుకు చార్లీని చంపేశాడు ! ఇవన్నీ తెలియాలంటే.. ట్రిక్ ఆర్ ట్రీట్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి