iDreamPost
android-app
ios-app

OTT లో బెస్ట్ 10 మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. వీటిని కానీ మిస్ చేశారా?

  • Published Jul 18, 2024 | 4:00 AMUpdated Jul 18, 2024 | 4:00 AM

Best 10 Murder Mystery Thrillers In OTT: ఓటీటీ లో ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే వీటిలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ , క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూడడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. మరి వాటిలో బెస్ట్ మర్డర్ మిస్టరీ మూవీస్ ఏంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

Best 10 Murder Mystery Thrillers In OTT: ఓటీటీ లో ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే వీటిలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ , క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూడడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. మరి వాటిలో బెస్ట్ మర్డర్ మిస్టరీ మూవీస్ ఏంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Published Jul 18, 2024 | 4:00 AMUpdated Jul 18, 2024 | 4:00 AM
OTT లో బెస్ట్ 10 మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. వీటిని కానీ మిస్ చేశారా?

ఓటీటీ లో ఉన్నవి ఒకటి రెండు సినిమాలైతే.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో.. ఎలా ఉన్నాయో చెప్పేయడం చాలా ఈజీ. కానీ ప్రస్తుతం ఓటీటీ ల పరిస్థితి అలా లేదు. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవ్వడమే కాకుండా వాటిలో ఏ సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి అనే లిస్ట్ కూడా వచ్చేస్తుంది. అలాగే ఆల్రెడీ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఏమైనా మిస్ చేశారేమో అని.. ఈ మధ్య ఏ సినిమాలు , సిరీస్ లు బావుంటాయి అనే సజ్జెషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటిలో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూసే జోనర్స్ ఒకటి హర్రర్, మరొకటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్. వాటిలో క్రైమ్ , మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఇలా అనేక రకాలుగా మూవీస్ ఉంటూ ఉంటాయి. మరి వాటిలో బెస్ట్ మర్డర్ మిస్టరీ మూవీస్ ఏంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

గాలివాన :

10 best murder mistery movies

ఈ తెలుగు సిరీస్ కు శరణ్ కొప్పి శెట్టి దర్శకత్వం వహించారు. కాగా ఈ సిరీస్ లో రాధికా శరత్ కుమార్, సాయి కుమార్, నందినీ రాయ్, చాందిని చౌదరి, చైతన్యకృష్ణ, ఆశ్రిత వేముగంటి, ‘తాగుబోతు’ రమేష్, శరణ్య అంతా కూడా ముఖ్య పాత్రలు పోషించారు. 2022 లో వచ్చిన ఈ సిరీస్ జీ 5 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ సిరీస్ చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

రౌతు కా రాజ్:

10 best murder mistery movies

ఈ సినిమాను ఆనంద్ సురాపూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీతో పాటు.. తెలుగు , తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో.. జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది . ఇక ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీతో పాటు.. రాజేష్ కుమార్ , అతుల్ తివారి , నారాయణి శాస్తి ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇక క్రైమ్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలన్నీ కూడా ఒకే బేస్ మీద రన్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో పోలీస్ ఆ కేసును ఇన్వెస్టిగేషన్ తీరు ప్రేక్షకులను చివరి వరకు కదలనివ్వకుండా .. ఈ మూవీ చూసేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

16- ఎవ్రి డీటెయిల్ కౌంట్:

10 best murder mistery movies

ఈ సినిమాకు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ అంటే అందరి ఊహ మలయాళీ, తమిళ చిత్రాలవైపు వెళ్తుంటాయి. కానీ తెలుగులో కూడా ఇలాంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయని ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది.

కోల్డ్ కేస్ :

10 best murder mistery movies

క్రైమ్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో తర్వాత ఏం జరుగుతుందా అనే ట్విస్ట్ తో పాటు.. ఆత్మలు వెంటాడే తీరు ప్రేక్షకులకు భయాన్ని కూడా కలిగిస్తుంది. చివరి వరకు కూడా ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి.

ఎలా వీజ పూంచిర:

10 best murder mistery movies

కొన్ని సినిమాలు స్టార్టింగ్ బోర్ కొట్టిన కూడా.. చివరి వరకు చూస్తే మాత్రం.. ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎందుకు చూడలేదు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ సినిమా కూడా అంతే.. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఏకంగా తన భార్యనే చంపి.. బిర్యానీ వండి పెడతాడు. ఇలాంటి సినిమా అసలు ఇప్పటివరకు చూసి ఉండరు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

రణం:

10 best murder mistery movies

మర్డర్ మిస్టరీ సినిమాలన్నీ కూడా ఒకటే థీమ్ తో ఉన్నా కూడా.. ఆ కేసులను ఎలా సాల్వ్ చేసి సొల్యూషన్ ఇచ్చారన్న కాన్సెప్ట్ మాత్రం ఆడియన్స్ కు.. థ్రిల్లింగ్ ఏపీరియెన్స్ ఇస్తుంది. అలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చే మూవీస్ లిస్ట్ లో ఇది ఒక మూవీ. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

తత్సమ తద్భవ:

10 best murder mistery movies

ఈ సినిమా చూసిన తర్వాత ట్విస్ట్ ల మధ్యలో సినిమా ఉందా సినిమా మధ్యలో ట్విస్ట్ లు ఉన్నాయా అనే డౌట్ రావడం ఖాయం. ఈ సినిమా ఆఖరిలో వచ్చే ట్విస్ట్ మాత్రం అసలు మిస్ కాకుండ చూడండి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి వెంటనే చూసేయండి.

ట్వేన్టీ వన్ గ్రామ్స్:

10 best murder mistery movies

మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లెర్స్ అంటే మరింత ఇంట్రెస్ట్ వచేస్తుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. ఎలా చేశారు ఇలా ప్రతి పాయింట్ కూడా ప్రేక్షకులను సినిమా చివరి వరకు సినిమా చూసేలా చేస్తుంది. ఇది కూడా అంతే ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా వారం వరకు ఆ సీన్స్ బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఖుఫియా:

10 best murder mistery movies

ఈ సినిమాలో రీసెర్చ్ అండ్ వింగ్ ఎలా పని చేస్తుందో వివరించే కథ ఇది.ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన నటి మాత్రం అందరికి పరిచయమే. ఆమె మరెవరో కాదు టబు. ఇక ఈ సినిమాలో టబుతో పాటు ఆశిష్ విద్యార్థి, అలీ ఫజల్, వామికా గబ్బీ , అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

అసుర:

10 best murder mistery movies

2020 లో అసుర అనే ఓ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చింది. అప్పట్లో ఈ సిరీస్ ఊహించని విజయాన్ని అందుకుంది. అప్పటివరకు ఎవరు టచ్ చేయని… ఓ సరికొత్త పాయింట్ ను టచ్ చేసారు మేకర్స్. దీనిలో ఇప్పటివరకు రెండు సీజన్స్ వచ్చాయి. ఈ రెండు సీజన్స్ కూడా ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరి ఈ సినిమాలలో మీరెన్ని సినిమాలు చూశారు.. ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి