iDreamPost
android-app
ios-app

OTT Biopic Movie: OTT లోకి స్పోర్ట్స్ డ్రామా బయో పిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

  • Published Jul 03, 2024 | 2:29 PM Updated Updated Jul 03, 2024 | 2:29 PM

బయో పిక్ సినిమాలకు థియేటర్ లో ఎలాంటి టాక్ వచ్చినా కానీ.. ఓటీటీ లో మాత్రం మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో త్వరలో ఓటీటీ లోకి మరొక సరికొత్త బయో పిక్ మూవీ రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

బయో పిక్ సినిమాలకు థియేటర్ లో ఎలాంటి టాక్ వచ్చినా కానీ.. ఓటీటీ లో మాత్రం మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో త్వరలో ఓటీటీ లోకి మరొక సరికొత్త బయో పిక్ మూవీ రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Jul 03, 2024 | 2:29 PMUpdated Jul 03, 2024 | 2:29 PM
OTT Biopic Movie: OTT లోకి స్పోర్ట్స్ డ్రామా బయో పిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

కామెడీ , రొమాన్స్ , సస్పెన్స్ , హర్రర్ , మర్డర్ మిస్టరీస్ లాంటి జోనర్స్ లో.. ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. ప్రేక్షకులు..అసలు మిస్ కాకుండా చూస్తూనే ఉంటారు. ఇక ఈ సినిమాలను ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తారో.. నిజ జీవిత గాధలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించే సినిమాలను కూడా అంతే ఇంట్రెస్ట్ తో ఆదరిస్తారు. ఈ క్రమంలో ఓటీటీ లో బయో పిక్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. థియేటర్ లో బయో పిక్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా కానీ.. ఓటీటీ లో మాత్రం అలాంటి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో త్వరలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ బయో పిక్ మూవీ రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల రూ. 140 కోట్ల బడ్జెట్‌తో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఓ బయో పిక్ మూవీ.. థియేటర్ లో రిలీజ్ అయింది. బాలీవుడ్ లో భూల్ భులయ్యా 2, షెహజాదా, సత్యప్రేమ్ కి కథ లాంటి వరుస సినిమాలతో పాపులర్ అయినా.. కార్తీక్ ఆర్యన్ నటించిన మూవీ “చందు ఛాంపియన్” . ఈ సినిమా జూన్ 14న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అయితే కలెక్షన్స్ విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రూ. 140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 78.6 కోట్లు మాత్రమే వసూళ్లు చేయగలిగింది. ఇక ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీని జులై చివరి వారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. స్ట్రీమింగ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. 1972 లో ఇండియాలో మొట్ట మొదటి సారి.. పారాలింపిక్ స్వర్ణ పథకాన్ని సాధించిన… ఆర్మీ మ్యాన్ , అథ్లెట్ మురళి కాంత్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన సినిమానే.. “చందు ఛాంపియన్” . అతని జీవితంలో ఎదుర్కున్న సమస్యలు.. వాటితో పోరాడి ఆయన సాధించిన విజయాలు ఇలా అన్నిటి గురించి ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పి తీరాలి. మరీ ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.