iDreamPost
android-app
ios-app

OTT లో బెస్ట్ 6 హర్రర్ మూవీస్ ఇవే.. వీకెండ్ వాచ్ లిస్ట్ యాడ్ చేయాల్సిందే

  • Published Aug 31, 2024 | 4:51 PM Updated Updated Aug 31, 2024 | 4:51 PM

OTT Best Horror Movies In Telugu: హర్రర్ మూవీస్ అంటే ఇష్టం ఉంటె కనుక.. ఈ సజ్జెషన్స్ అసలు మిస్ కాకండి. ఓటీటీ లో ఉన్న ఈ బెస్ట్ హర్రర్ సినిమాలను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Horror Movies In Telugu: హర్రర్ మూవీస్ అంటే ఇష్టం ఉంటె కనుక.. ఈ సజ్జెషన్స్ అసలు మిస్ కాకండి. ఓటీటీ లో ఉన్న ఈ బెస్ట్ హర్రర్ సినిమాలను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Aug 31, 2024 | 4:51 PMUpdated Aug 31, 2024 | 4:51 PM
OTT లో బెస్ట్ 6 హర్రర్ మూవీస్ ఇవే.. వీకెండ్ వాచ్ లిస్ట్ యాడ్ చేయాల్సిందే

ఓటీటీ లోకి వస్తున్న అన్ని సినిమాలను.. కథను బట్టి ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. ఇక వాటిలో హర్రర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఓటీటీ లోకి వచ్చిన ప్రతి హర్రర్ మూవీని ప్రేక్షకులు అసలు మిస్ చేయకుండా చూస్తూనే ఉంటారు. అయితే ఎన్ని మూవీస్ చూసినా కానీ ..ఇంకా చూడాల్సిన సినిమాలు చాలానే ఉంటాయి. వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్స్. హర్రర్ మూవీస్ ఉంటే కనుక ఈ సజ్జెషన్స్ అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఓటీటీ లో ఉండే బెస్ట్ హర్రర్ సినిమాల జాబితా ఇలా ఉంది. ఈ సినిమాలన్నీ కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో ప్రతి వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక కేవలం ప్రైమ్ లో ఉండే హర్రర్ సినిమాలను మాత్రమే చూడాలంటే మాత్రం ఈ లిస్ట్ చూడాల్సిందే.

ఐటీ :

డెర్రీ, మైనేలో లో ఉండే ఏడుగురు యంగ్ స్టర్స్ చుట్టూ ఈ మూవీ కథ కొనసాగుతూ ఉంటుంది. చిన్న పిల్లలు ఈ సినిమాను చూడకపోవడం మంచిది. ఈ సినిమా చివరి వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతూ ఉంటుంది. పైగా ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.

సస్పీరియ :

1970 లో బెర్లిన్ లో వరల్డ్ లోనే బెస్ట్ అనిపించుకున్న.. హెలెనా మార్కోస్ డ్యాన్స్ కోసం.. యంగ్ అమెరికన్ డ్యాన్సర్ సూసీ బానియన్ ఆడిషన్ కోసం వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురౌతాయి. ఈ సినిమాను ఓల్డ్ క్లాసిక్ మూవీ 1977 మూవీ నుంచి రీమేక్ చేశారు. తెలుగు లాంగ్వేజ్ లో అయితే అందుబాటులో లేదు కానీ.. సబ్ టైటిల్స్ తో మాత్రం చూసేయొచ్చు.

హెరిడెటరి:

ఓ ముసలావిడ మరణంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆమె కూతురు కుటుంబం చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. ఆ ముసలావిడ మరణంతో వారి కుటుంబంలో అనేక రకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అత్యంత భయంకరమైన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి హర్రర్ మూవీ లవర్స్ ఈ సినిమాను అసలు మిస్ చేయొద్దు.

కంజ్యూరింగ్:

ఈ సినిమా గురించి ఆల్రెడీ అందరూ వినే ఉంటారు. ఇప్పటివరకు ఉన్న అన్ని హర్రర్ సినిమాలలో .. అతి భయంకరంగా భయపెట్టే హర్రర్ మూవీ ఏదైనా ఉందంటే.. అది ఈ సినిమానే. ఇప్పటికే ఈ ఫ్రాంచైజిలో రెండు సినిమాలు వచ్చాయి. ఇవి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. పైగా తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఈ సినిమాలను చూడకపోతే.. వెంటనే చూసేయండి.

ఇవన్నా:

భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ను ఎంజాయ్ చేసేవారికి మాత్రమే ఈ మూవీ.. ప్రతి సీన్ లో హర్రర్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉంటాయి. 1943 లో జరిగిన ఓ కథ .. తిరిగి 1993 లో కూడా కొనసాగితే ఎలా ఉంటుంది. 1943 లో జరిగిన సంఘటనలు 1993 లో ఎందుకు మెదిలాయి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇంకా ఈ సినిమా చూడకపోతే వెంటనే ఈ వీకెండ్ చూసేయండి.

ఈవిల్ డెడ్ రైజ్:

90’స్ లో హర్రర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఫ్రాంచైజ్ ఈ మూవీ. ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటికే ఐదు సినిమాలు వచ్చాయి. సరదాగా సినిమాను ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయస్. ఈ సిరీస్ లో హర్రర్ కంటే కూడా వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి రక్తంతో రాసిన కథలను చెప్పి తీరాలి. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ సిరీస్ ను లైట్ తీసుకుంటే.. మంచి సిరీస్ మిస్ అయినట్లే.

ఇక ఈ సినిమాలు కాకుండా ఇంకా అనేక ప్లాట్ ఫార్మ్స్ లో చూడాల్సిన హర్రర్ మూవీస్ చాలానే ఉన్నాయి. కాబట్టి వీటిని అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.