iDreamPost
android-app
ios-app

Baak Movie OTT: తమన్నా, రాశి ఖన్నా బాక్ మూవీ .. ఏ OTT లో అంటే!

  • Published Jun 02, 2024 | 5:37 PM Updated Updated Jun 02, 2024 | 5:37 PM

కొత్త కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు.. ఈ మూవీ చూసేందుకు రెడీ అయిపోండి. తమన్నా రాశి ఖన్నా కలిసి నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ఓటీటీ లోకి ఎప్పుడు రాబోతుందో చూసేద్దాం.

కొత్త కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు.. ఈ మూవీ చూసేందుకు రెడీ అయిపోండి. తమన్నా రాశి ఖన్నా కలిసి నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ఓటీటీ లోకి ఎప్పుడు రాబోతుందో చూసేద్దాం.

  • Published Jun 02, 2024 | 5:37 PMUpdated Jun 02, 2024 | 5:37 PM
Baak Movie OTT: తమన్నా, రాశి ఖన్నా బాక్ మూవీ .. ఏ OTT లో అంటే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన సినిమా “అరణ్మనై 4”. తెలుగులో ఈ సినిమా “బాక్” అనే పేరుతో వచ్చింది. ఈ సినిమా మే 3 న థియేటర్ లో రిలీజ్ అయింది. తమిళంలో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ దక్కాయి. కానీ మిక్సెడ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా కంటే తర్వాత రిలీజ్ అయినా సినిమాలు కూడా ఓటీటీ లోకి వచ్చేశాయి. దీనితో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు . దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలకు థియేటర్ లో ఓ రకంగా టాక్ వినిపిస్తుంటే.. ఓటీటీ లోకి వచ్చిన తరవాత టాక్ మరోలా ఉంటుంది. అది హిట్ టాక్ అయినా ప్లాప్ టాక్ అయినా సరే. దీనితో ఏ సినిమా టాక్ ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకులు చెప్పలేకపోతున్నారు. ఇక ఇప్పుడు అందరి ఎదురుచూపు తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన సినిమా “అరణ్మనై 4” సినిమా గురించే. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ+ హాట్‍స్టార్ సొంతం చేసుకుంది. కానీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. దాదాపు ఈ నెలలోనే ఓటీటీ లోకి వస్తుందని భావిస్తున్నారు ప్రేక్షకులు . దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పైగా అరణ్మనై 4 చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. శివశంకర్ అనే వ్యక్తి ఓ లాయర్. అతని చెల్లి శివానీ ఓ రోజు ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆమె భర్త కూడా చనిపోతాడు. అయితే అతని చెల్లి ఆత్మహత్య చేసుకోలేదని శివశంకర్ బలంగా నమ్ముతాడు. దాని వెనుక జరిగిన కథను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు శివానీ విషయంలో ఏం జరిగింది? ఆమెది హత్యా ! ఆత్మహత్యా ? ఈ మరణాల వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏంటి ? అనేది ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.