iDreamPost
android-app
ios-app

బాహుబలి ప్రిక్వెల్ OTT లోకి వచ్చేసింది.. కానీ ఆ ఒక్కటే మైనస్

  • Published May 17, 2024 | 3:07 PM Updated Updated May 17, 2024 | 3:07 PM

Baahubali Crown Of Blood OTT: ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు యానిమేషన్ సిరీస్ రూపంలో ప్రీక్వెల్ కూడా వచ్చేసింది. కానీ ప్రేక్షకులు మాత్రం కాస్త నిరాశ పడుతున్నారు. కారణం ఏంటంటే..

Baahubali Crown Of Blood OTT: ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు యానిమేషన్ సిరీస్ రూపంలో ప్రీక్వెల్ కూడా వచ్చేసింది. కానీ ప్రేక్షకులు మాత్రం కాస్త నిరాశ పడుతున్నారు. కారణం ఏంటంటే..

  • Published May 17, 2024 | 3:07 PMUpdated May 17, 2024 | 3:07 PM
బాహుబలి ప్రిక్వెల్ OTT లోకి వచ్చేసింది.. కానీ ఆ ఒక్కటే మైనస్

ఇండస్ట్రీలో మాహిష్మతి సామ్రాజ్యం పేరుతో సరికొత్త ప్రపంచాన్నే సృష్టించాడు జక్కన్న. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమాలకు ఉన్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు. ఇండియన్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్లు కొత్త ప్రపంచాన్ని సృష్టించాయి . ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా , రమ్యకృష్ణ ఇంకా ఎంతో మంది స్టార్ క్యాస్టింగ్ తో ఈ సినిమాను తెరకెక్కించి.. ఓ బ్రాండ్ ను సెట్ చేసాడు జక్కన్న. ఇక ఇప్పుడు ఆ ఫ్రాంచైజ్ ను మరింత విస్తరింపజేసేలా.. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ అనే యానిమేషన్ సిరీస్ తో కొత్త రికార్డు సృష్టించడానికి నాంది పలికారు మేకర్స్. ఇక ఈ సిరీస్ మే 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది కానీ, ఎన్నో అంచనాలను పెట్టుకున్న ప్రేక్షకులను మాత్రం నిరాశ పరిచారు మేకర్స్. కారణం ఏంటంటే..

సాధారణంగా బాహుబలి ఫ్రాంచైజీ అనగానే అందరికి భారీ అంచనాలు ఏర్పడతాయి. అందులోను ఇది యానిమేషన్ సిరీస్.. ప్రత్యేకించి పిల్లలు ఈ సిరీస్ ను చూడడానికి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఈ సిరీస్ ను అర్క మీడియా బ్యానర్స్‌పై దర్శకుడు S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించగా జీవన్ జె. కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. అనుకున్న టైం కె అంటే మే 17నుంచి ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 భాషల్లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చారు. కానీ కేవలం మొదటి రెండు ఎపిసోడ్స్ ను మాత్రమే విడుదల చేయడంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతున్నారు. మరి మిగిలిన ఎపిసోడ్స్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.

ఇప్పటికి అయితే ఈ సిరీస్ మొదటి రెండు ఎపిసోడ్స్ గురించి బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ సిరీస్ పై బాగానే బజ్ ఏర్పడుతుంది, ఇక ఈ సిరీస్ గురించి ఇదివరకే జరిగిన ఓ ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. “బాహుబలి వరల్డ్ పెద్దది.. స్క్రీప్ట్ రాసేటప్పుడు ప్రతి పాత్రకు బ్యాక్ స్టోరీ, క్యారెక్టర్ ఆర్క్, తర్వాత కథను కూడా రాశాము. ఆ కంటెంట్ అంతా ప్రేక్షకులకు చెప్పాలని ఉండేది. మన దగ్గర సినిమా అంటే థియేటర్ రన్ ముగిశాక మరిచిపోతాం. కానీ, వెస్ట్రన్ సినిమాలో మూవీ అంటే ఒక బ్రాండ్ .. బాహుబలిని కూడా యానిమేషన్ సిరీస్‌లు, కార్టూన్ బుక్స్, గేమింగ్‌తో బ్రాండ్ చేయాలని భావిస్తున్నాము.” అని పేర్కొన్నారు రాజమౌళి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.