iDreamPost

OTT Movies :ఈ వారం OTT లో చూడాల్సిన 5 సినిమాలను/సిరీస్ లు ఇవే..

  • Published Jul 02, 2024 | 3:32 PMUpdated Jul 02, 2024 | 3:32 PM

This Week Must Watch 5 Movies In OTT : ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటీటీ లో చాలానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలలో చూడదగిన సినిమాలు, సిరీస్ లు మాత్రం కొన్నే ఉన్నాయి.. అవేంటో చూసేద్దాం.

This Week Must Watch 5 Movies In OTT : ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటీటీ లో చాలానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలలో చూడదగిన సినిమాలు, సిరీస్ లు మాత్రం కొన్నే ఉన్నాయి.. అవేంటో చూసేద్దాం.

  • Published Jul 02, 2024 | 3:32 PMUpdated Jul 02, 2024 | 3:32 PM
OTT Movies :ఈ వారం OTT లో చూడాల్సిన  5 సినిమాలను/సిరీస్ లు ఇవే..

ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలు ఇవే.. ఈ వారం ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూడండి అంటూ.. ప్రతి వారం ప్రేక్షకులను రిమైండ్ చేస్తూ.. అసలు మరిచిపోనివ్వకుండా.. ఎప్పటికప్పుడు ఓటీటీ లో రాబోయే సినిమాల గురించి అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. దీనితో మూవీ లవర్స్ కూడా వారం ముందే నుంచే వీకెండ్ కు ఏ మూవీ చూడాలి అనే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం కూడా ఓటీటీ లో చాలానే సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. కానీ వాటిలో చూడదగిన సినిమాలు, సిరీస్ లు మాత్రం కేవలం కొన్నే ఉన్నాయి. మరి ఆ సినిమాలు , సిరీస్ లు ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

మార్కెట్ మహాలక్ష్మి :

This week OTT movies and series

ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి చాలానే రోజులు అయింది. కేరింత మూవీలో శ్రీకాకుళం యాసతో అందరిని నవ్వించిన నటుడు పార్వతీశం ఈ మూవీలో హీరోగా నటించాడు. లవ్ స్టోరీ లంటే అందరు ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటారు. ఈ సినిమా కూడా దాదాపుగా అలాంటిదే. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా జులై 4 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

శశి మధనం :

This week OTT movies and series

వెబ్ సిరీస్ లంటే అందరు ఎంతో ఇంట్రెస్ట్ చుపిస్తున్నారో.. ఈ క్రమంలోనే కొత్త కొత్త కంటెంట్ తో చాలా వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నారు మేకర్స్ . ఇక ఇప్పుడు ఓటీటీ లో సరికొత్త వెబ్ సిరీస్ రాబోతుంది. యుట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా.. బాగా ఫేమస్ అయినా జంట సిద్ధూ, సోనియా సింగ్. వీరిద్దరూ కలిసి నటించిన సిరీస్ శశి మధనం. ఈ సిరీస్ జులై 4 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

మీర్జాపుర్ సీజన్ 3 :

This week OTT movies and series

వెబ్ సిరీస్ లంటే అందరికి ఇష్టం ఉన్నా కూడా.. కొన్ని వెబ్ సిరీస్ లు అందరికి మైండ్ లో స్ట్రాంగ్ గా గుర్తుండిపోతాయి. వాటిలో ఒకటి మీర్జాపుర్ . ఈ వెబ్ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇప్పటికే మీర్జాపుర్ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మూడవ సీజన్ రానుంది. అది కూడా తెలుగులో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ జులై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

గరుడన్ :

This week OTT movies and series

ఇది ఒక తమిళ మూవీ.. అయినప్పటికి ఈ సినిమాలో నటించిన వారంతా కూడా అందరికి సుపరిచితమే. ఇప్పుడు ఓటీటీ లో అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు కాబట్టి.. ఈ సినిమాను అర్ధం చేసుకోడం అంత కష్టమేమి కాదు. ఇక యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు నచ్చే వాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఈ సినిమా జులై 3 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

మలయాళీ ఫ్రమ్ ఇండియా:

మలయాళీ సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల మదిని ఇట్టే దోచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ లోకి మరొక మలయాళీ సినిమా రాబోతుంది. మే 1 న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా మొదటి షో నుంచి కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా జులై 5 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

కాబట్టి ఎంచక్కా ఈ వారం ఓటీటీ లో ఈ సినిమాలను , సిరీస్ లను అస్సలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి