P Krishna
Two Malayalam Movies Streaming on OTT: ఇటీవల ఓటీటీ వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు సందడి చేస్తున్నాయి.
Two Malayalam Movies Streaming on OTT: ఇటీవల ఓటీటీ వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు సందడి చేస్తున్నాయి.
P Krishna
ఈ మధ్య కాలంలో ఓటీటీ పుణ్యమా అని ఆడియన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుంది. కరోనా తర్వాత చాలా మంది ఓటీటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా కొత్త సినిమాలు, వెబ్ సీరీస్‌తో మూవీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ, హర్రర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ జోనర్ లో వస్తున్న మూవీస్, వెబ్ సీరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఒకే రోజు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ మూవీస్ వివరాలు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ఈ ఏడాది మాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించిన మూవీస్ ఒకే రోజు రెండు వేర్వేరు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఈ మూవీస్ లో ఒకటి ‘విశేషం’కామెడీ డ్రాగా కాగా, మరొకటి క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’ మూవీ. మంగళవారం (సెప్టెంబర్ 10) నుంచి స్ట్రిమింగ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఫెర్టిలిటీ సెంటర్లు, వాటి చికిత్స విధానం గురించి కామెడీ పూయిస్తూ వచ్చిన చిత్రం ‘విశేషం’. జులై 19న థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. అంతేకాదు ఐఎండీబీలోనూ ఈ చిత్రం ఏకంగా 9 రేటింగ్ తో దూసుకువెళ్లింది. కొచ్చిలో నివసించే ఓ జంట చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ మూవీ డైరెక్టర్ సూరజ్ టామ్. ఆనంద్ మధుసూదన్, చిన్ను చాందిని, అల్తాఫ్ సలీమ్, బైజు జాన్సన్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
సినీ ఇండస్ట్రీలో చాలా వరకు క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే సినిమాకు ఎంతో ఆదరణ లభిస్తుంది. అలాంటి క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన మూవీ ‘తలవన్’. బిజు మీనన్, ఆసిఫ్ అలీ పోటా పోటీగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ మంగళవారం (సెప్టెంబర్ 10) నుంచి సోనీ లీవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి జీస్ జాయ్ దర్శకత్వం వహించారు. బిజు మీనన్, ఆసిఫ్ అలీ, మియా జార్జ్, అనుశ్రీ హీరోయిన్లుగా నటించారు. అయ్యప్పనుమ్ కోషియన్, తుండు, శివమ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో ఎన్నో ట్విస్టులు, ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. ఇక బిజు మీనర్ విషయానికి వస్తే.. గోపించంద్ నటించిన రణం, రవితేజ నటించిన ఖతర్నాక్ మూవీలో నటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెండు మూవీస్ హ్యాపీగా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.