iDreamPost
android-app
ios-app

సోనీ లివ్‌లో ఆకట్టుకుంటోన్న ‘కన్‌ఖజురా’ టీజర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

  • Published May 13, 2025 | 4:43 PM Updated Updated May 13, 2025 | 4:43 PM

అన్ని జోనర్స్ కంటే కూడా సస్పెన్స్ థ్రిల్లర్స్ కు ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. అందులోను OTT లో వీటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మరో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ OTT లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

అన్ని జోనర్స్ కంటే కూడా సస్పెన్స్ థ్రిల్లర్స్ కు ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. అందులోను OTT లో వీటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మరో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ OTT లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

  • Published May 13, 2025 | 4:43 PMUpdated May 13, 2025 | 4:43 PM
సోనీ లివ్‌లో ఆకట్టుకుంటోన్న ‘కన్‌ఖజురా’ టీజర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

OTT లో మరో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ రిలీజ్ కాబోతుంది. అదే ‘కన్‌ఖజురా’. ఈ టీజర్‌ను మే 2 న రిలీజ్ చేశారు. గోవాలో, అక్కడి ప్రాంతాల్లో జరిగే నేరాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిశ్శబ్దం మోసపూరితంగా ఉంటుంది.. అది బయటకు కనిపించే దాని కంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ ‘మాగ్పీ’ని హిందీ ప్రేక్షకుల కోసం అనువదిస్తున్నారు. అయితే ‘కన్‌ఖజురా’ని ఇండియన్ ఆడియెన్స్‌ కోసం పూర్తిగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఇద్దర విడిపోయిన అన్నదమ్ముల మధ్య జరిగే పోరు.. తమ చీకటి గతాన్ని ఎదుర్కోవలసి రావడం.. జ్ఞాపకశక్తి, వాస్తవికత మధ్యలో వారిద్దరూ నలిగిపోవడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ ఉంటుంది.

‘కన్‌ఖజురా’ పాత్రను పోషించిన రోషన్ మాథ్యూ మాట్లాడుతూ.. ‘‘కన్‌ఖజురా’లో ఎంతో ఎమోషన్ ఉంటుంది. ఈ కథలోని భావోద్వేగ తీవ్రత, గందరగోళం కింద ఉన్న నిశ్శబ్దం వంటి అంశాలనే ఇందులో నన్ను నటించేలా చేశాయి. అషు అనే పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి. క్షణానికో రకంగా మారుతుంటుంది. కానీ లోపల నిశ్శబ్ద తుఫాను ఉంటుంది. ఈ కథ అందరి హృదయాల్ని కదిలించడం కాకుండా వెంటాడుతుంది’ అని అన్నారు.

అజయ్ రాయ్ నిర్మాతగా.. చందన్ అరోరా దర్శకత్వం వహించిన ‘కన్‌ఖజురా’లో మోహిత్ రైనా, రోషన్ మాథ్యూ, సారా జేన్ డయాస్, మహేష్ శెట్టి, నినాద్ కామత్, త్రినేత్ర హల్దార్, హీబా షా మరియు ఉషా నద్కర్ణి వంటి వారు నటించారు. ప్రశంసలు పొందిన ఇజ్రాయెల్ సిరీస్ మాగ్పీ ఆధారంగా ఈ షోను యెస్ స్టూడియోస్ లైసెన్స్‌తో సృష్టికర్తలు ఆడమ్ బిజాన్స్కీ, ఓమ్రీ షెన్హార్, డానా ఈడెన్‌లు డోనా, షులా ప్రొడక్షన్స్ నిర్మించారు. ‘కన్‌ఖజురా’ మే 30 నుంచి సోనీ LIVలో మాత్రమే ప్రసారం కానుంది. ఇక ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sony LIV (@sonylivindia)