iDreamPost
android-app
ios-app

కంటెంట్ బేస్డ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ‘ఆహా’- సుహాస్ యూనిక్ మూవీ “గొర్రె పురాణం”ఆహాలో స్ట్రీమింగ్

  • Published Oct 08, 2024 | 3:52 PM Updated Updated Oct 08, 2024 | 3:52 PM

Gorre Puranam Movie: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ శాసిస్తుంది. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్దిరోజులకే కొత్త సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. కొత్త సినిమాలే కాదు.. వెబ్ సీరీస్ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

Gorre Puranam Movie: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ శాసిస్తుంది. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్దిరోజులకే కొత్త సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. కొత్త సినిమాలే కాదు.. వెబ్ సీరీస్ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

కంటెంట్ బేస్డ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ‘ఆహా’- సుహాస్ యూనిక్ మూవీ “గొర్రె పురాణం”ఆహాలో స్ట్రీమింగ్

ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ ఊపేస్తుంది. తెలుగు భాషలో ‘ఆహా’ ఓటీటీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. థ్రిల్లర్‌, సస్పెన్స్‌, పారానార్మల్‌ థ్రిల్లర్స్‌, సైకలాజికల్‌, సైంటిఫిక్‌, సోసియో ఫాంటసీ వంటి విభిన్న జానర్ల వచ్చే సినిమాలను ఆహ ఎంతగానో ప్రోత్సహిస్తుంది. బుల్లితెరపై పాన్‌ ఇండియా స్థాయిలో మాత్రమే కాదు గ్లోబల్‌ వేదికపై ఆదరణ పొందిన తెలుగులో చూడగలుగుతున్నాం. వైవిద్యమైన కథనాలు, వినూత్నమైన సినిమాటిక్‌ విలువలతో నిర్మితమైన మూవీస్ తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ఆహా ముందుంది. సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కించే మలయాళ సినిమాలు తెలుగు ప్రజలకు అందించంలో కూడా ఆహా ముందుంది.

Gorre Puranam movie

ఆహా ఓటీటీలో ఈ మధ్య కాలంలో వచ్చిన చాప్రా మర్డర్‌ కేస్‌, అయ్యప్పన్‌ కోషియన్‌, ఆహా, డెరిక్‌ అబ్రహమ్‌, భార్గవి నిలయం వంటి మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించాయి. అలాగే ప్రజాదరణ పొందిన మారుతీనగర్‌ సుబ్రమణ్యం, 35 వంటి సినిమా  ఓటీటీలో వచ్చాయి. ఐఎమ్‌డీబీ అత్యదిక రేటింగ్‌ ఇచ్చిన సింబా సినిమా కూడా ఆహాలో స్ట్రీమ్ంగ్‌ అవుతుంది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా లో మంచి కంటెంట్ ఉంటే చాలు మేము ప్రోత్సాహం అందిస్తామంటున్నారు ఆహా యజమాన్యం. ఈ విధానానికి శ్రీకారం చుట్టింది ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్లే..!

తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ  హీరో రేంజ్ కి ఎదిగిన నటుల్లో ఒకరు సుహాన్. టాలీవుడ్ లో ఇండస్ట్రీలో కొత్తదనంతో తెరకెక్కిన ‘కలర్‌ఫోటో’ వంటి మూవీస్‌ని ఆహా వేదికగా అవకాశమిచ్చి కొత్త ఆలోచనలకు ప్రోత్సాహాన్ని అందించింది. ఈ మూవీలో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్.  కలర్ ఫోటో మూవీకి జాతీయ అవార్డు వచ్చింది. మొదటి నుంచి విభిన్నమైన కథాంశాలతో ముందుకు వస్తున్నాడు హీరో సుహాన్. అదే కోవలో ప్రసన్నవదనం, గొర్రె పురాణం వంటి ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమాలతో సుహాస్‌ తనకంటూ ప్రత్యేక పేజీలను రాసుకుంటున్నారు. సినిమా కథలను ఆచీ.. తూచీ ఎంచుకుంటూ తెలుగు పేక్షకులకు మరింత దగ్గరైతున్న యువ నటుల్లో ఒకరు సుహాన్ ది ప్రత్యేక శైలి. సుహాన్ నటించిన వైవిధ్యభరిత చిత్రం ‘గొర్రె పురాణం’ ఆహా ఓటీటీ వేదికలో విడుదల కానుండం విశేషం.

ఇక సినిమాలపై హీరో సుహాన్ కి ఉన్న ముందు చూపు గురించి ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల ఈ యంగ్ హీరో నటిస్తున్న సినిమాలు మినిమం గ్యారెంటీ అనేలా ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. సుహాన్ నటించిన గొర్రె పునాణం మూవీలో వైవిద్యాన్నిగుర్తించి ఆహా వేదిక స్వతహాగా ఈ సినిమాను స్వీకరించి ప్రసారం చేస్తుంది. ఈ తరహా సినిమాలకు బాగా ఇష్టపడుతున్న టాలీవుడ్‌ ప్రేక్షకులు గొర్రె పురాణం సినిమాని ఆస్వాదిస్తున్నారు. హీరో సుహాన్ మాట్లాడుత.. ‘ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం సినిమాలపై ఇష్టం, మాలో ఉన్న టాలెంట్ తో ప్రయాణం కొనసాగిస్తుంటే.. ‘ఆహా’ వంటి వేదికలు మాకు వారదులుగా నిలుస్తు, మమ్ముల్ని మరింతగా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నాయి’ అని అన్నారు.