Swetha
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన ఓ సినిమా త్వరలో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన ఓ సినిమా త్వరలో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతూనే ఉన్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలకు .. భాషతో, జోనర్ తో సంబంధం లేకుండా ఆదరణ లభించడంతో.. థియేటర్ లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి సినిమాలు.. అలానే, ఆయా చిత్రాలు ఏ భాషలో థియేటర్ లో విడుదల అయినా కూడా .. ఓటీటీ లో మాత్రం అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా, మలయాళ సూపర్ స్టార్ నటించిన తాజా చిత్రం “మలైకోటై వాలిబన్”. థియేటర్ లో మిక్సడ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ఇక ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపొయింది. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది జనవరి 26న .. పీరియాడికల్ యాక్షన్ మూవీగా .. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “మలైకోటై వాలిబన్” చిత్రం.. ప్రేక్షకుల నుంచి మిక్సడ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ చిత్రానికి లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ మోహన్ లాల్ , విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్, మనికంద రాజన్, ఆండ్రియా రావెరా లాంటి వారి ముఖ్య పాత్రలు పోషించారు. అయితే , ఈ సినిమా థియేటర్ లో విడుదల కాకముందు.. సినిమాకు సంబంధించి విడుదలైన మూవీ పోస్టర్స్, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఓ రకమైన ఆసక్తి కలిగించిన మాట వాస్తవమే. కానీ, థియేటర్ లో విడుదల తర్వాత మాత్రం “మలైకోటై వాలిబన్” చిత్రం యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయింది.
మలయాళ చిత్రమైన “మలైకోటై వాలిబన్” చిత్రం డిజిటక్ రైట్స్ ను.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. కాగా, ఫిబ్రవరి 23 నుంచే మలైకోటై వాలిబన్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా మళయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉన్నట్లు తెలియజేసింది. కాగా, మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై ఈ సినిమాను రూపొందించారు. కథ పరంగా థియేటర్ లో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. మోహన్ లాల్ నటన పరంగా మాత్రం అందరిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి, “మలైకోటై వాలిబన్” మూవీ ఓటీటీ ఎంట్రీపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Snatching victory from the jaws of defeat, watch the epic tale of this warrior conquering every challenge thrown at him. #MaalaikottaiVaaliban streams from 23rd Feb in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada. pic.twitter.com/3p8eY9dhwr
— Disney+ Hotstar (@DisneyPlusHS) February 20, 2024