iDreamPost
android-app
ios-app

OTT Movie: OTTలోకి సూపర్ హిట్ కామెడీ డ్రామా! ఈ అర్ధరాత్రి నుండే స్ట్రీమింగ్!

  • Published Apr 18, 2024 | 2:42 PM Updated Updated Apr 26, 2024 | 6:22 PM

ఇప్పుడు ఎక్కడ చూసిన ఓటీటీ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే ఓటీటీ లోకి వస్తున్న సినిమాలు అన్ని ఇన్ని కావు. అదీ కాకుండా డిఫరెంట్ జోనర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో యూత్ ని ఆకట్టుకోడానికి ఒక మంచి సినిమా ఓటీటీ లోకి రాబోతుంది.

ఇప్పుడు ఎక్కడ చూసిన ఓటీటీ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే ఓటీటీ లోకి వస్తున్న సినిమాలు అన్ని ఇన్ని కావు. అదీ కాకుండా డిఫరెంట్ జోనర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో యూత్ ని ఆకట్టుకోడానికి ఒక మంచి సినిమా ఓటీటీ లోకి రాబోతుంది.

  • Published Apr 18, 2024 | 2:42 PMUpdated Apr 26, 2024 | 6:22 PM
OTT Movie: OTTలోకి సూపర్ హిట్ కామెడీ డ్రామా! ఈ అర్ధరాత్రి నుండే స్ట్రీమింగ్!

థియేటర్స్ లో సినిమాలు చూడడం అంటే అందరికి మజానే .. కానీ ఓటీటీ సినిమాలు చూడడం అంటే ఇంకాస్త కిక్ ఇస్తున్నాయి అందరికి. ఎందుకంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు.. ఎవరికీ ఎప్పుడు వీలైతే అప్పడు ఓటీటీ లలో ఉండే సినిమాలను, సిరీస్ లు చూసేయొచ్చు. ఇప్పుడు చాలా మంది యంగ్ స్టర్స్ అయితే.. వీకెండ్ వస్తే ఏ ఓటీటీ లో ఏ సినిమా ఉందా అని సెర్చింగ్ స్టార్ చేసేస్తున్నారు. అలాగే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా వాటి స్పీడ్ ను పెంచేస్తూ.. ప్రతి వారం కొత్త కొత్త సినిమాలను, సిరీస్ లను రిలీజ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఒక సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపొయింది. అదే ” ఆల్ ఇండియా ర్యాంక్”. మరి ఈ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుందనే వివరాలను చూసేద్దాం.

యూత్ ని ఆకట్టుకునేలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు, సిరీస్ లు తెరకెక్కాయి. అయితే ఆల్ ఇండియా ర్యాంక్ అనే ఈ సినిమా మాత్రం చాలా డిఫరెంట్. 17 ఏళ్ళ కుర్రాడి లైఫ్ లో ఎలాంటి సమస్యలను ఎదుర్కున్నాడు అనే ప్లాట్ తో ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. ఈ సినిమాను టీనేజర్స్ తో పాటు.. వారి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ సినిమాకు వరుణ్ గ్రోవర్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో.. శశి భూషణ్, సమతా సుదీక్ష, గీతా అగర్వాల్, షీబా చద్దా, బోధిసత్వ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన.. విడుదల చేశారు. థియేటర్స్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది, నెట్ ఫ్లిక్స్.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సోసైటిలో చుట్టూ జరిగే సమస్యలను బేస్ చేసుకుని.. ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. స్కూలింగ్ అయిపోయిన తర్వాత .. ఎవరో చెప్పారని ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ చేసారని.. వారికీ నచ్చని కోర్స్ లో జాయిన్ అయ్యి.. ఎవరికీ ఏమి చెప్పలేక.. తమకు నచ్చింది చేయలేక వారిలో వారే సఫర్ అయ్యే విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఒక 17 ఏళ్ళ కుర్రాడి కథే ఈ స్టోరీ, ఈ సినిమా టీనేజర్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. అంతే కాకుండా వారితో పాటు పేరెంట్స్ కూడా ఈ సినిమాను చూడడం వలన .. టీనేజర్స్ ప్రాబ్లెమ్స్ అందరికి వారికీ కూడా అర్ధమయ్యే అవకాశం ఉంది. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.