Swetha
ఓటీటీ లో ప్రతి వారం డజన్ల కొద్దీ సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. వాటిలో ఎక్కువగా అందరూ ఇష్టపడే సినిమాలు హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లెర్స్. తాజాగా మరొక సస్పెన్స్ థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ లో ప్రతి వారం డజన్ల కొద్దీ సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. వాటిలో ఎక్కువగా అందరూ ఇష్టపడే సినిమాలు హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లెర్స్. తాజాగా మరొక సస్పెన్స్ థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Swetha
గతంలో సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే.. మెల్లగా కాలం మారుతున్న కొద్దీ.. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కు తగినట్లుగా.. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆయా సినిమాలను మేక్ ఓవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఓటీటీ లకు ఆదరణ బాగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ కు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఆయా సినిమాలు థియేటర్ లో ఎటువంటి టాక్ సంపాదించుకున్న కానీ, ఒక్కసారి ఓటీటీలోకి అడుగుపెట్టాయంటే మాత్రం.. ఎనలేని ప్రేక్షక ఆదరణ ఆ సినిమాలకు లభిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఓటీటీ లో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరొక క్రైమ్ థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటి , ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.
సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ పేరు “రిప్లీ”. ఈ సిరీస్ ను 1955లో వచ్చిన ఒక క్రైమ్ స్టోరీ.. “ది టాలెంటెడ్ మిస్టర్ రిప్లే” ను ఆధారంగా తీసుకుని రూపొందించారు. ఇది ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ లో ఆండ్రూ స్కాట్, డిక్కీ గ్రీన్‌లీఫ్‌గా జానీ ఫ్లిన్, మార్జ్ షేర్‌వుడ్‌గా డకోటా ఫానింగ్ నటించారు. ఈ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. కాగా ఈ సిరీస్ కు స్టీవెన్ జైలియన్ దర్శకత్వం వహించారు. అయితే మొదట ఈ సిరీస్ ను షఓ టైమ్ లో స్ట్రీమింగ్ చేయాలనీ అనుకున్నారు మేకర్స్. కానీ, అది జరగలేదు . ఈ సిరీస్ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ 2023 లో కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఏప్రిల్ 4నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది “రిప్లీ” వెబ్ సిరీస్. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఒక బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి.
ఇక “రిప్లీ” వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే.. 1960లో న్యూయార్క్‌లో దారి తప్పిన తన కొడుకును తిరిగి ఇటలీకి.. తీసుకుని వచ్చేందుకు టామ్ రిప్లీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. అనేదే ఈ సిరీస్ కథాంశం. అయితే ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే సిరీస్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ లోనే ఉంటుంది. అప్పటి కథను ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు కాబట్టి అలానే దీనిని తీర్చిదిద్దారు. ఈ సిరీస్ చివరి ఎపిసోడ్ వరకు కూడా.. అదే థ్రిల్ ను ఇస్తూ అద్భుతంగా కొనసాగుతోంది. ప్రతి ఎపిసోడ్ లోని ప్రతి సీన్ ప్రేక్షకులను క్షణ క్షణం ఉత్కంఠభరితంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాబట్టి ఈ సిరీస్ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోందని చెప్పడంలో ఎటువంటి అతిసేయోక్తి లేదు. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.