Swetha
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాల ధ్యాసలో పడిపోయి.. ప్రేక్షకులు కొన్ని మంచి సినిమాలను, సిరీస్ లను మిస్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ మీరు మిస్ చేసిన వాటిలో ఉందేమో ఓ లుక్ వేసేయండి.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాల ధ్యాసలో పడిపోయి.. ప్రేక్షకులు కొన్ని మంచి సినిమాలను, సిరీస్ లను మిస్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ మీరు మిస్ చేసిన వాటిలో ఉందేమో ఓ లుక్ వేసేయండి.
Swetha
సినిమాలకంటే కూడా సిరీస్ లకు ఈ మధ్య ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక సస్పెన్స్ తో ఎండ్ చేస్తూ.. తర్వాత ఏమి జరుగుతుందా అనే ఆసక్తిని అందరికి కలిగిస్తున్నాయి. దీనితో సిరీస్ లు చూడడానికి అందరు ఎంతో ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు. అందులోను ఆ సిరీస్ లు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఆధారంగా తీసుకుని రూపొందించినవి అయితే ఆ సినిమాలను, సిరీస్ లను మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చాయి. మన ఇండియాలో జరిగిన ఒకానొక ఇన్సిడెంట్ లో ఇండియన్ రైల్వే మెన్ చేసిన సాహసాలకు సంబంధించని ఓ సిరీస్.. ఓటీటీ లో ఉందన్న సంగతి ఎంత మందికి తెలుసు. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా పేరు “రైల్వే మెన్”. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి.. స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఎక్కడ ఏమి జరుగుతున్న కూడా క్షణాల్లో తెలిసిపోతుంది. అసలు ఏ కమ్యూనికేషన్ లేని రోజులలో .. అంటే 1984 లో ఇండియాలో జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ సంఘటనను బేస్ చేసుకుని తీసిన సిరీస్ ఇది. ఆ సమయంలో కొంతమంది రైల్వే మెన్ తమ ప్రాణాలకు తెగించి .. ఎలా ఈ సమస్యలను పరిక్షరించారనేది. అంతా కూడా ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయ్యి ఉంటె మాత్రం ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అంబాటులో ఉంది. అసలు ఈ సినిమా ఎందుకు వర్త్ వాచింగ్ .. ఈ సినిమాను ఎందుకు చూడాలి అనే విషయానికొస్తే.. ఇది నిజ జీవిత సంఘటన.. ఎంతో మందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఘటన.
ఈ సిరీస్ కథేంటంటే.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఉంటుంది. అది ఒక పురుగుల మందు తయారు చేసే ప్లాంట్. అందులో మిథైల్ ఐసోసనియేట్ అనే ప్రమాదకరమైన ఒక రసాయనాన్ని తయారు చేస్తుంటారు. అయితే ఈ ఫ్యాక్టరీ నుండి లాభాలు రావడం లేదని .. ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ భద్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోరు. దాని కారణంగా గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపినా కూడా ఆ కంపెనీ యజమానులు లెక్క చేయరు. ఊహించినట్లుగానే.. ఆ ఘటన జరిగింది. భోపాల్ నగరం అంతా మిథైల్ ఐసోసనియేట్ గ్యాస్ లీక్ అయ్యింది. నగరం అంత అల్లకల్లోలంగా తయారైంది. ఇక ఆ తర్వాత.. ఇఫ్తికార్ సిద్ధిఖీ అనే ఓ స్టేషన్ మాస్టర్, కంపెనీ మాజీ ఉద్యోగి ఇమద్, ఓ దొంగ, సెంట్రల్ రైల్వే జోన్ జెనరల్ మేనేజర్ ప్రాణాలకు తెగించి వారిని ఎలా కాపాడగలిగారు అనేదే తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.