iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion: దెయ్యాలతో యువ సన్యాసి పోరాటం! OTTలోని ఈ మూవీ చూసినంత సేపు వణికిపోతారు!

  • Published May 11, 2024 | 6:32 PM Updated Updated May 11, 2024 | 6:32 PM

ఏదైనా సినిమా చూస్తే సినిమా అంటే ఇది అనే ఫీలింగ్ రావాలి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో కనుక ఈ సినిమా కూడా ఉందేమో ఓసారి చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఏదైనా సినిమా చూస్తే సినిమా అంటే ఇది అనే ఫీలింగ్ రావాలి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో కనుక ఈ సినిమా కూడా ఉందేమో ఓసారి చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published May 11, 2024 | 6:32 PMUpdated May 11, 2024 | 6:32 PM
OTT Movie Suggestion: దెయ్యాలతో యువ సన్యాసి పోరాటం! OTTలోని ఈ మూవీ చూసినంత సేపు వణికిపోతారు!

కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఇది కదా సినిమా అనే సినిమా అని అనిపిస్తూ ఉంటుంది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఉన్న అన్ని సినిమాలను చూసాం అని అనుకునే వారికి ఇంకా చూడాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి అని కొన్ని సినిమాలు గుర్తు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్స్ జోనర్ లో చాలా తక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు చూడడానికి ఓ మంచి ఎక్స్పీరియన్స్ ను కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం.. వెంటనే చూసేయండి, మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ మిస్టరీ థ్రిల్లర్ పేరు.. “ది 8th నైట్”. ఈ సినిమా కథేంటంటే.. కొన్ని వేల సంవత్సరాల క్రితం రెండు వేరు వేరు పేటికలలో బంధించి ఉన్న .. కొన్ని అతీంద్రియ శక్తులు తిరిగి వచ్చి.. మనుషులందరినీ చంపేస్తూ ఉంటాయి. అయితే వాటిని ఆపాలని ఓ యువ సన్యాసి ప్రయత్నిస్తూ ఉంటాడు. తిరిగి వచ్చిన ఆ రాక్షసుడికి రెడ్ ఐ, బ్లాక్ ఐ అని రెండు కళ్ళు ఉంటాయి. ఆ రెండిటిలోనే ఆ రాక్షసుడి శక్తులు ఉంటాయి. వాటిలో రెడ్ ఐ ఓ ఏడుగురిని ఆవహించిన తర్వాత.. బ్లాక్ ఐ ని కలిసిందంటే.. ప్రపంచం అంతం అయిపోతుంది. దానిని ఆపేందుకు ఆ యువ సన్యాసి ఏం చేస్తాడు ? అతనే బలి అవుతాడా లేదా దానిని ఆపుతాడా ? తర్వాత ఏం జరిగింది ? తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే, ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

ఈ సినిమాలోని ప్రతి సీన్ కూడా మిస్టీరియస్ గా కొనసాగుతూ , సీట్లకు అతుక్కుపోయి ఉత్కంఠతో చూసేలా ఉంటుంది ఈ సినిమా. ప్రస్తుతం. ఈ మధ్య కాలంలో ఈ తరహా చిత్రాలను బహుశా చూసి ఉండరేమో. సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్స్ నచ్చే వాళ్లకు ఈ సినిమ బాగా నచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను చూస్తూ బోర్ కొట్టిన వాళ్లకు ఈ సినిమా.. ఓ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పి తీరాలి. మీరు మిస్ చేసిన సినిమాలలో ఈ సినిమా కనుక ఉంటే వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.