భీమా OTT రీలిజ్ డేట్ కన్ఫామ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే

గోపించద్ హీరోగా వచ్చిన భీమా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

గోపించద్ హీరోగా వచ్చిన భీమా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

ఓటీటీలకు క్రేజ్ పెరిగిన తర్వాత థియేటర్ కు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మౌత్ టాక్ బాగుండి.. భారీ క్రేజ్ ఉన్న సినిమాలైతేనే థియేటర్స్ కు వెళ్తున్నారు. లేదంటే.. ఓటీటీల్లో స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా మూవీ ‘భీమా’ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు సినిమా స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ వివరాలు..

గోపిచంద్ హీరోగా నటించిన సినిమాపై ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా.. ట్రైలర్ విడుదల తర్వాత అవి మరింత పెరిగాయి. ఇక ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, అనుకున్న స్థాయిలో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్ రావడంతో ఆశించిన మేర వసూళ్లు రాలేదు. ఈక్రమంలో చాలా మంది ప్రేక్షకులు భీమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పటినుంచి అంటే

భీమా సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 25వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఉగాది పండుగ సందర్భంగా హాట్‍స్టార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సర్‌ప్రైజ్ అంటూ ఈ ప్రకటన చేసింది. “యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌ భీమాను ఏప్రిల్ 25వ తేదీన మీ స్క్రీన్‍లపైకి తీసుకొస్తున్నాం” అని హాట్‍స్టార్ ట్వీట్ చేసింది. ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది.

అయితే భీమా సినిమా ఈపాటికే ఓటీటీలోకి రావాల్సింది. ఏప్రిల్ తొలివారంలోనే స్ట్రీమింగ్ అవుతుందని అందరూ భావించారు. అయితే, ఈ సినిమా మాత్రం అనుకున్న దాని కంటే ఆలస్యంగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 25వ తేదీన హాట్‍స్టార్‌ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇక భీమా చిత్రంలో గోపిచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. మరో పాత్రలో కూడా కనిపించారు. ఇక ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు కనిపించారు. వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, నాజర్, నరేశ్ కీలకపాత్రలు పోషించారు.

భీమా కథేంటంటే..

మహేంద్రగిరి అనే ప్రాంతంలో భీమా సినిమా సాగుతుంది. ఆ ప్రాంతానికి ఓ పురాణ చరిత్ర ఉంటుంది. అక్కడ పరశురామ క్షేత్రం ఉంటుంది. ఆ ఊరికి ఎస్సైగా భీమా (గోపీచంద్) వస్తాడు. ఆ ప్రాంతంలో భవానీ (ముకేశ్ తివారి) అరాచకాలు చేస్తూ.. ప్రజలపై ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. అతడిని భీమా అడ్డుకుంటాడు. అయితే, భీమా ఆ ప్రాంతానికి వచ్చేందుకు కారణమేంటి.. పరశురామ క్షేత్రం ఎందుకు మూతపడింది.. దాన్ని మళ్లీ తెరిచారా అనే కథతో భీమా సినిమా వచ్చింది.

Show comments