iDreamPost
android-app
ios-app

India Banned Movies: ఇండియాలో నిషేధానికి గురైన ఈ 6 సినిమాలు.. OTTల్లో చూడొచ్చు!

  • Published Apr 17, 2024 | 4:47 PM Updated Updated Apr 17, 2024 | 4:47 PM

మేకర్స్ రూపొందించిన అన్ని చిత్రాలు కొన్ని సార్లు థియేటర్స్ లోకి రాకపోవచ్చు. అయితే అనేక కారణాల వలన థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలేంటి.. అవి ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో చూడొచ్చు అనే విషయాల గురించి చూసేద్దాం.

మేకర్స్ రూపొందించిన అన్ని చిత్రాలు కొన్ని సార్లు థియేటర్స్ లోకి రాకపోవచ్చు. అయితే అనేక కారణాల వలన థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలేంటి.. అవి ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో చూడొచ్చు అనే విషయాల గురించి చూసేద్దాం.

  • Published Apr 17, 2024 | 4:47 PMUpdated Apr 17, 2024 | 4:47 PM
India Banned Movies: ఇండియాలో నిషేధానికి గురైన ఈ 6 సినిమాలు.. OTTల్లో చూడొచ్చు!

ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ఇక వీటిలో చాలా వరకు రూపొందించిన సినిమాలన్నీ కూడా కొన్ని థియేటర్స్ లో రిలీజ్ అయితే.. మరికొన్ని డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ అవుతాయి. అయితే కొన్ని సినిమాలు అనేక కారణాల వలన థియేటర్ లో బ్యాన్ చేస్తూ ఉంటారు. అలా బ్యాన్ చేసిన చిత్రాలలో ఇండియాలోని అనేక భాషల చిత్రాలతో పాటు.. కొన్ని ఇంగ్లీష్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆయా సినిమాలలోని కంటెంట్ బాగానే ఉన్నా సరే.. థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మాత్రం ఎందుచేతనో నిరాకరించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాలను ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో చూసేయొచ్చు. మరి ఈ సినిమాలేంటి ఎక్కడ చూడొచ్చు అనే వివరాలను చూసేద్దాం.

1) ఫైర్ : ప్రైమ్ వీడియో
ఆర్టికల్ 377 నిషేదానికి ముందు వచ్చిన సినిమా ఇది. ఫైర్ సినిమా కూడా ఆర్టికల్ 377 తరహాలోనే ఉండే ఒక మూవీ.. ఈ సినిమాలో నందితా దాస్, షబానా అజ్మీ లెస్బియన్స్ గా నటించారు. ఇద్దరి జంటల మధ్యన జరిగిన కథ ఇది. 1996 లో వచ్చిన బోల్డ్ కంటెంట్ తో ఉన్న ఈ సినిమా ఇప్పటివారికి నచ్చే అవకాశం ఉంది.

2) లవ్ (LOEV) : నెట్ ఫ్లిక్స్
ఈ సినిమా కూడా గే సెక్స్ కు సంబంధించిన సినిమానే. ఈ సినిమా 2017 లో వచ్చింది. దీనిని కూడా థియేటర్ లో నిషేధించినా కానీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం అందుబాటులో ఉంది.

3) అన్‌ఫ్రీడమ్ :నెట్‌ఫ్లిక్స్
ఈ సినిమా 2018 లో వచ్చింది. ఇది రెండు వేరు వేరు దేశాలు.. కథల చుట్టూ తిరుగుతుంది. ఓవైపు ఒక లెస్బియన్ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేయాలి అనుకోడం, మరోవైపు.. ఒక ముస్లిం టెర్రరిస్టు ఓ లిబరల్ స్కాలర్ ను కిడ్నాప్ చేయడం, ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

4) బ్లాక్ ఫ్రైడే : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఇండియాలో నిషేదించారు. ఈ సినిమా ఓ గ్యాంగ్‌స్టర్, ముంబైలో జరిగే పేలుళ్ల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను చూసిన వారంతా కూడా.. ఇండియన్ సినిమాకు ఇదొక మైల్ స్టోన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5) వాటర్ : యూట్యూబ్
2005 లో వచ్చిన ఈ సినిమా.. 1930ల్లో అనేక కారణాల చేత భర్తను కోల్పోయి.. విధవలుగా మారిన కొంతమంది యువతుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాలో సతి సహగమనం, భర్తను కోల్పోతే అప్పటి సమాజం ఒక స్త్రీని ఎలా చూసేవారు అనే తీరును కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

6) బాండిట్ క్వీన్ : ప్రైమ్ వీడియో
ఈ సినిమా బందిపోటు రాణిగా పేరుగాంచిన ఫూలన్ దేవి జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. థియేటర్ లో అయితే ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాన్ని కల్పించలేదు కానీ.. ప్రైమ్ వీడియోలో మాత్రం అందుబాటులో ఉంది.

ఇప్పటివరకు ఈ సినిమాలను ఎవరు కూడా చూసి ఉండరు. మరి ఇండియా బ్యాన్ చేసిన ఈ సినిమాలలో ఎటువంటి కంటెంట్ ఉందో చూసెయ్యండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.