iDreamPost
android-app
ios-app

OTT Suggestion: కొడుకు కోసం కిడ్నాపర్స్ తో అమ్మ పోరాటం! OTTలోకి కట్టిపడేసే థ్రిల్లర్!

  • Published Apr 30, 2024 | 7:00 PM Updated Updated Apr 30, 2024 | 7:00 PM

థ్రిల్లర్ మూవీస్ లో అనేక రకాల జోనర్స్ ఉంటాయి.. క్రైమ్ , సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్.. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం ఓ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

థ్రిల్లర్ మూవీస్ లో అనేక రకాల జోనర్స్ ఉంటాయి.. క్రైమ్ , సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్.. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం ఓ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

  • Published Apr 30, 2024 | 7:00 PMUpdated Apr 30, 2024 | 7:00 PM
OTT Suggestion: కొడుకు కోసం కిడ్నాపర్స్ తో అమ్మ పోరాటం! OTTలోకి కట్టిపడేసే థ్రిల్లర్!

ఓటీటీ లోకి ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. మరి మూవీ లవర్స్ అని అనుకునే వారంతా ఓటీటీ లోకి వచ్చే ప్రతి సినిమాను మిస్ చేయకుండా చూస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఎక్కడో ఓ దగ్గర రేటింగ్ చూసి, ట్రైలర్ చూసి.. ఆయా సినిమాలను, సిరీస్ లు మిస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడైనా కనిపించినప్పుడు వాటి గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ముఖ్యంగా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. థ్రిల్లర్ మూవీస్ లో అనేక రకాల జోనర్స్ ఉంటాయి.. క్రైమ్ , సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్.. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం ఓ యాక్షన్ థ్రిల్లర్. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పటివరకు చెప్పుకున్న అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ పేరు “కిడ్నాప్”. ఈ సినిమా 2017 లో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పైగా తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ను ఎందుకు చూడాలి.. ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా తల్లి కొడుకుల మధ్యన జరుగుతూ ఉంటుంది. తన కన్న కొడుకుకు కష్టం వస్తే.. తల్లి ఎంత దూరం అయిన వెళ్తుంది అని చెప్పడానికి ఈ సినిమా ఓ బెస్ట్ అని చెప్పి తీరాలి. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. సినిమాను పూర్తిగా లీనం అయ్యి చూస్తే.. ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా ఉంటుంది. అసలు ఈ సినిమా కథేంటంటే..

ఈ సినిమాలో కార్ల అనే ఓ మహిళ తన భర్తతో విడాకులు తీసుకుని.. ఓ రెస్టారెంట్ లో పని చేస్తూ ఉంటుంది. తనకు ఆరేళ్ళ వయసున్న ఈ కొడుకు ఉంటాడు. తన కష్టం తన కొడుకుకు తెలియకుండా పెంచుతుంది. ఓ రోజు వారిద్దరూ కలిసి ఓ పార్క్ కు వెళ్తారు. ఆ సమయంలో ఆమె ఓ ఫోన్ కాల్ లో ఉండగా.. ఇటు పిల్లవాడు మాయమైపోతాడు. ఎంత వెతికినా అతను కనిపించడు. ఎక్కడో దూరంగా ఓ కార్లో ఓ మహిళా తన కొడుకును తీసుకు వెళ్లడం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమెను ఫాలో అవుతూ వెళ్లినా కూడా ఎటువంటి ఫలితం కనిపించదు. కొంత దూరం వెళ్ళాకా ఆ కార్ కనిపించినా కూడా.. కిడ్నపార్ నువ్వు ఫాలో చేయడం ఆపకపోతే.. నీ కొడుకును చంపేస్తాను అంటూ బెదిరించడంతో ఆమె ఫాలో చేయడం ఆపేస్తుంది. ఆ తర్వాత ఏమైంది ! చివరకి ఆమె తన కొడుకును కాపాడిందా లేదా! అక్కడ నుంచి సినిమా అనేక రకాల ట్విస్ట్ లతో కొనసాగుతుంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.