iDreamPost
android-app
ios-app

OTT Movie: OTT లో తెలుగులోకి రాబోతున్న మరో మలయాళీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Apr 23, 2024 | 4:22 PM Updated Updated Apr 26, 2024 | 6:19 PM

ఓటీటీ లో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో రిలీజ్ అయిన కొన్నాళ్ళకు ఓటీటీ లోకి వచ్చినా కానీ.. అవి ఒరిజినల్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మలయాళ సినిమా తెలుగులో కి రాబోతుంది.

ఓటీటీ లో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లో రిలీజ్ అయిన కొన్నాళ్ళకు ఓటీటీ లోకి వచ్చినా కానీ.. అవి ఒరిజినల్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మలయాళ సినిమా తెలుగులో కి రాబోతుంది.

  • Published Apr 23, 2024 | 4:22 PMUpdated Apr 26, 2024 | 6:19 PM
OTT Movie: OTT లో తెలుగులోకి రాబోతున్న మరో మలయాళీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఓటీటీ లోకి వచ్చే సినిమాలు ఏ భాషలో ఉన్నా సరే.. ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు తమిళ, మలయాళ, బాలీవుడ్ చిత్రాలు ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉన్నా సరే.. వాటికి ఆదరణ బాగానే లభించాయి. ఎంత ఒరిజినల్ లాంగ్వేజ్ తో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా సరే.. తెలుగు ఆడియన్స్ కు మాత్రం ఆయా సినిమాలు తెలుగులో చూస్తూనే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అలా మలయాళ సినిమాలకు తెలుగులో పెరుగుతున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో మలయాళ సినిమా తెలుగులో.. త్వరలో ఓటీటీ లోకి రానున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి ఆ సినిమా ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందనే విషయాలను చూసేద్దాం.

మలయాళీ సినిమాలు తెలుగు వారి మదిని దోచేస్తున్న క్రమంలో.. ఆల్రెడీ ఒరిజినల్ లాంగ్వేజ్ తో ఉన్న సినిమాలను కూడా.. తెలుగులో ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మలయాళ ప్రేక్షకులను.. బాగా ఆకట్టుకున్న సినిమా.. “నాయట్టు”. ఈ సినిమా 2021 లో థియేటర్ లో విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద.. భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళీ భాషలో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా అంబాటులోకి తీసుకురానున్నారు. ఈ సినిమాను తెలుగులో.. “చుండూరు పోలీస్ స్టేషన్” పేరుతో.. ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తెలుగు డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 26 నుంచి ఈ సినిమా ఆహలో స్ట్రీమింగ్ కానుందనే విషయాన్నీ.. ఆహ ప్లాట్ ఫార్మ్ అధికారికంగా ప్రకటించింది.

ఇక నాయట్టు సినిమా కథ విషయానికొస్తే.. కేరళలో ఎన్నికలు జరిగే సమయంలో.. ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఇక అదే స్టేషన్ లో ఉండే ఒక కానిస్టేబుల్, ఎస్ ఐ కూడా ఉంటారు. అయితే ఒక రోజున ఆ పోలీస్ ఆఫీసర్, ఎస్ఐ ఒక సామజిక వర్గానికి చెందిన ఒక నాయకుడితో వివాదానికి దిగుతారు. ఇది ఇలా ఉండగా ఒక రోజు ఆ ముగ్గురు ఒక ఫంక్షన్ కు వెళ్లివస్తుండగా.. అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి మరణిస్తాడు. అతను సామజిక వర్గానికి చెందిన వ్య్తకి కావడంతో.. ఆ సమస్యకు రాజకీయ రంగు అంటుకుంటుంది. దీనితో ఈ ముగ్గురు ఆ కేస్ లో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది ! పోలీసులు అయ్యి ఉండి ఇలాంటి ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడగలిగారు ! ఇవన్నీ తెలియాలంటే పోలీసుల కోసం పోలీసులే గాలించే ఈ కథను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.