Venkateswarlu
కేవలం రెండు రోజుల్లో ఏకంగా 9 సినిమాలు పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆ చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి..
కేవలం రెండు రోజుల్లో ఏకంగా 9 సినిమాలు పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆ చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి..
Venkateswarlu
ప్రతీ వారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తూ ఉన్నాయి. ఇక, ఈ వారంలో కేవలం రెండు రోజుల్లోనే 9 సూపర్ హిట్ మూవీలు పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు సంబంధించిన చిత్రాలు ఈ వారం స్ట్రీమ్ అవ్వనున్నాయి. ఆయా సినిమాల స్ట్రీమింగ్ తేదీలను స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాయి. ఆహా, హాట్‌స్టార్, సోనిలివ్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా జీ5లలో థియేటర్లలో హిట్ అయిన సినిమాలు స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.
ఓటీటీలో సూపర్ హిట్ అయిన మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్‌గా మా ఊరి పొలిమేర 2 తెరకెక్కింది. నవంబర్3వ తేదీ థియేటర్లలో సందడి చేసింది. సీక్వెల్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా మా ఊరి పొలిమేర 2 సక్సెస్ సాధించింది. ఈ చిత్రం ఆహాలో త్వరలో స్ట్రీమింగ్ అవ్వనుంది. డిసెంబర్ 8వ తేదీనుంచి అందుబాటులోకి రానుంది.
ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన జిగిరితాండ డబుల్ ఎక్స్ నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రాఘవా లారెన్స్, ఎస్‌జే సూర్యలు కీలక పాత్రలు చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ విడుదల అయింది. రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 8వ తేదీనుంచి అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది.
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘కీడా కోలా’ నవంబర్ 3వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కామెడీ ఓరియెంటెడ్ చిత్రం కావటంతో ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ చిత్రం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 8వ తేదీనుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.
దేశాన్ని గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ‘కూసే మునిస్వామి వీరప్పన్’ వెబ్ సిరీస్. ఈ తమిళ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవ్వనుంది. డిసెంబర్ 8వ తేదీనుంచి అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మరి, రెండు రోజుల్లోనే 9 సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.