Idream media
Idream media
చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ రెండో విడతకు అధికారులు శ్రీకారం చుట్టారు. వచ్చె నెలలో ఈ పథకం కింద లబ్ధిదారులకు నగదును అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద అర్హులైన నేతన్నలకు వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం 24 వేల రూపాయలను ఒకే దఫాలో జమ చేస్తుంది.
తన సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల కష్టాలు, నష్టాలు చూసిన తర్వాత సీఎం వైఎస్ జగన్ తన ఎన్నికల మెనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా నేతన్నలకు ఏడాదికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చాను. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే నేతన్నలను ఆదుకునేందుకు వైఎస్సార్ నేతన్న హస్తం పథకం ప్రవేశపెట్టారు. గత ఏడాది డిసెంబర్ 21వ తేదీన తొలిసారి అర్హులైన నేతన్నలకు 24 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు.
ఈ ఏడాది రెండో విడతగా జూన్ మొదటి వారంలోనే నగదను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం కోసం అర్హులైన వారి నుంచి కూడా నూతంగా దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తోంది. తాజాగా ఈ ఏడాది కొత్తగా 43,795 మంది వైఎస్సార్ నేతన్న హస్తం పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి అర్హతలు పరిశీలించిన తర్వాత వారికి పథకం వర్తింపజేయనున్నారు. కాగా, ఇప్పటికే జూన్ నెలలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం రెండో విడత కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.