ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్‌లో తెలుగు యువకుడిపై వ్యాసం!

ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్‌లో తెలుగు యువకుడిపై వ్యాసం!

ప్రపంచ ప్రఖ్యాతి గాచిన ఫోర్బ్స్ పత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో వచ్చే ప్రతి వ్యాసం, న్యూస్ కి ఎంతో విలువ ఉంటుంది. ఇందులో ఎంతో మంది ప్రముఖల గురించి వ్యాసాలు ప్రచురితమవుతుంటాయి. అలాంటి ప్రఖ్యాతి గాచిన పత్రిక వెబ్ సైట్ లో మన తెలుగు యువకుడిపై వ్యాసం ప్రచరితమైంది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాయి ప్రజ్వల్ కాటం రాజుపై వ్యాసం రాశారు.  ప్రజ్వల్ తో పాటు అమెరికాకు చెందిన బోర్డాన్ జెస్టర్స్ ను ప్రపంచం యువ స్టార్టప్ అధినేతల్లో ఒకరిగా ప్రశంసిస్తూ కూడా ఫోర్బ్స్ పత్రిక తన వెబ్ సైట్ లో ప్రచురించింది.  రద్దీ ప్రదేశాల్లో ట్రాఫిక్ నియంత్రించేలా, ప్రమాదాలను నివారించేందుకు ఓ టెక్నాలజీని ప్రజ్వల్ రూపొందించాడు. దీంతో అమెరికాలో ప్రజ్వల్ పేరు మారుమోగిపోయింది. ఈ క్రమంలోనే ఫోర్స్బ్ పత్రికలో కూడా ప్రజ్వల్ కు చోటు దక్కింది.

కేఎల్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ గా పని చేస్తున్న సాయి ప్రజ్వల్ తండ్రి కాటం రాజు సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం… సాయి ప్రజ్వల్ 2016లో కేఎల్ యూనివర్సిటీలో బీటేక్ పూర్తి చేశాడు.  అనంతరం  ఉన్నత విద్య కోసం 2017లో అమెరికా వెళ్లారు. అక్కడ పరిచమైన జోర్డాన్ జెస్టర్స్ తో కలిసి నూతన సాంకేతికతపై అవగాహన పెంచుకున్నాడు.  ఆ తరువాత ‘ఆటో మోటాస్’ అనే ఆటోమేటెడ్ కర్బ్ మేనేమెంట్ ఫ్లాట్ ఫాం ను 2023లో ఆవిష్కరించారు.

యూఎస్ఏలోని నగరాలు, ఎయిర్ పోర్టుల్లో రద్దీని తెలుసుకోవడానికి, అలానే ప్రమాదాలను నివారించడానికి దీన్ని ఉపయోగించేలా రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ‘ఆటోమోటాస్’ కెమెరాల సాయంతో ఎక్కడ ట్రాఫిక్ ఉందో తెలుసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకుని  రద్దీ సమస్యను అధిగమించ వచ్చు. అలానే ప్రమాదాలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రజ్వలో రూపొందించిన ఆటోమోటస్ సాంకేతికతను నచ్చి.. టెక్ స్టార్స్ వెంచర్స్ అనే సంస్థ 12 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

వీటితో ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసి ఎక్కువ మంది ప్రజలకు చేరువ చేయాలని ఆ సంస్థ కోరింది. ప్రస్తుతం సాయి ప్రజ్వల్ తోపాటు అతడి స్నేహితులు కలిసి రూపొందించిన టెక్నాలజీ అమెరికాలోని 12 నగరాల్లో ఉపయోగిస్తున్నారని సాయి ప్రజ్వల్ తండ్రి వివరించారు. దీంతో ప్రపంచ యువ స్టార్టప్ అధినేతలంటూ ఫోర్బ్స్ మ్యాగజైన్  ప్రజ్వల్ , బోర్డాన్ జెస్టర్స్ లపై వ్యాసం ప్రచురించింది. మరి.. తెలుగు కుర్రాడు.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పత్రిక ఫోర్బ్స్ లో రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అందంగా కనిపిస్తున్న ఈ నర్సు మనిషి కాదు! ఏకంగా 7 మందిని..!

Show comments