P Krishna
Donald Trump: అమెరికాలో జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై విజయం సాధించారు. 2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Donald Trump: అమెరికాలో జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై విజయం సాధించారు. 2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
P Krishna
మొన్నటి వరకు అమెరికాలో దేశ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నిక ఎంతో ఉత్కంఠంగా సాగింది. మొత్తానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యారు.తన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై విజయం సాధించారు. 2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కేబినేట్ శాఖ కేటాయింపు పై దృష్టి సారించారు. ఇప్పటికే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వాకి తన కేబినెట్‌లో చోటు కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా కొత్త నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్ ను బుధవారం నియమించారు. ఈ సందర్భంగా తులసి గబ్బార్డ్ గొప్ప వీరనారి అని, గర్వించదగిన రిపబ్లికన్ అని పార్టీల్లోనూ మద్దతు లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. మాజీ కాంగ్రెస్ సభ్యురాలిగా తులసి అమెరికా తొలి హిందు కాంగ్రెస్ మహిళగా గుర్తింపు పొందారు. ఆమె సైనికురాలిగా పనిచేసి ఎన్నో మెడల్స్ అందుకున్నారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని యుద్ధ ప్రాంతాలకు సేవలు అందించారు. కొంతకాలం డెమొక్రాట్ పార్టీ నుంచి విడిపోయి ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీలో చేరారు.
అసలు ఈ తులసీ గబ్బార్డ్స్ ఎవరు..?
అమెరికాలో జన్మించిన తులసి తండ్రి సమోవాన్ యూరోపియన్ సంతతికి చెందిన వారు. ఆమె తల్లి హిందూ మతం పట్ల ఉన్న ఆసక్తితో ఆ మతాన్ని స్వీకరించారు. తన పిల్లలకు హిందు పేర్లు పెట్టుకున్నారు. తులసి గబ్బర్డ్ కూడా హిందూ మతం పై ఎంతో విశ్వాసం ఉందని పలు సందర్భాల్లో వెల్లడించారు. అంతేకాదు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై చేయి వేసి మరీ ప్రమాణం చేశారు.తులసీ గబ్బార్డ్ సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ ను పెళ్లి చేసున్నారు. ఆమె ఇరవై ఏళ్ల క్రితం యూఎస్ ఆర్మీ అయిన నేషనల్ గార్డ్ లో పనిచేశారు. ఇకాక్, కుబైట్ లోనూ ఆమె సేవలు అదించారు. 2013 నుంచి 2021 వరకు హవాయి పార్లమెంట్ సభ్యురాలిగా కొనసాగారు. 2020 లో తులసి గబ్బర్డ్ డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని సమర్పించారు. కాకపోతే మద్దతు లభించకపోవడంతో తన అభ్యర్దిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.
2022లో డెమొక్రటిక్ పార్టీ నుంచి విడిపోయి రిపబ్లికన్ పార్టీలో చేరారు.అప్పటి నుంచి ట్రంప్ మద్దతుతో సెలబ్రెటీగా కొనసాగుతున్నారు. కొన్నేళ్లుగా ఆమె ట్రంప్ తో స్నేహంగా ఉంటున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మద్య డిబేట్ జరిగిన సమయంలో ఆయను సిద్దం చేయడంలో తులసి కీలక పాత్ర పోషించారు. ట్రంప్, తులసి మధ్య ఉన్న స్నేహసంబంధాల నేపథ్యంలో ఆమెను ఇంటెలిజెన్స్ (DNI) డైరెక్టర్‌గా నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే రాజకీయ వేత్త వివేక్ రామస్వామి, ఎలెన్ మాస్క్ లను ప్రభుత్వ సమర్ధత విభాగానికి నాయకత్వం వహిస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. వివేక్ రామస్వామి ఒక సంపన్న బయోటెక్ వ్యవస్థాపకులు. కార్పోరేట్ రంగంలో పనిచేసే ఖర్చు తగ్గించుకోవడంపై ఆయన దృష్టిసారిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.