P Venkatesh
ఓ యువతి ఫారిన్ లో స్థిరపడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో జాబ్ ఇస్తే చాలు శాలరీ తీసుకోకుండా పనిచేస్తానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
ఓ యువతి ఫారిన్ లో స్థిరపడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో జాబ్ ఇస్తే చాలు శాలరీ తీసుకోకుండా పనిచేస్తానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
P Venkatesh
ఉద్యోగం చేసేదే కాసిన్ని డబ్బుల కోసం. శాలరీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. జీతం చేతికి వచ్చిన కొద్ది రోజులకే ఐస్ కరిగినట్టు కరిగి పోతుంది. అందుకే మంచి శాలరీలు వచ్చే జాబ్స్ కోసం చూస్తుంటారు. అలాంటిది జాబ్ ఇస్తే చాలు శాలరీ తీసుకోకుండా పని చేస్తానంటోంది ఓ యువతి. ఉద్యోగం ఇవ్వండి ఫ్రీగా పనిచేస్తాను అని ఆమె చేసిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరైనా లక్షల్లో శాలరీలు వచ్చే జాబ్స్ ను కోరుకుంటారు. కానీ, ఆ యువతి మాత్రం ఉచితంగానే ఉద్యోగం చేస్తానని చెబుతోంది. ఇంతకీ ఆమె ఎందుకు ఫ్రీగా జాబ్ చేయాలనుకుంటుంది? దాని వల్ల ఆమెకు వచ్చే లాభం ఏంటీ? ఆ వివరాలు మీకోసం..
మన దేశం నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్తుంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే సెట్టిల్ అవ్వాలని కలలు కంటుంటారు. ఇదే తరహాలో శ్వేత కోతండన్ అనే యువతి పై చదువుల కోసం యూకే వెళ్లింది. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ లో MSc మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. 2022లో ఆమె గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయితే మరో మూడు నెలల్లో శ్వేత స్టూడెంట్ వీసా టైం ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే శ్వేత యూకేలో ఉండేందుకు ఉచితంగా పని చేసేందుకు రెడీ అయినట్లు చెప్పుకొచ్చింది. ఆమె అక్కడ ఎంప్లాయ్ వీసా తీసుకొని అక్కడే స్థిరపడాలని అనుకుంటోంది. ఈక్రమంలో శ్వేతా కోతండన్ వీసా స్పాన్సర్ చేసే కంపెనీలో డిజైన్ ఇంజనీర్ జాబ్ కోసం వెతుకుతుంది.
ఈ క్రమంలో ఉద్యోగం ఇస్తే ఫ్రీగా పనిచేస్తానని లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. రోజు పన్నెండు గంటలపాటు వారం రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఆమెకు 300 జాబ్స్ కు అప్లై చేసుకున్నప్పటికీ.. అందులో ఒక్క కంపెనీ కూడా వీసా ఇవ్వడానికి ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు వీసా ఇచ్చే కంపెనీలో ఫ్రీగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఓ ట్విట్ చేసింది. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నానని తెలిపింది. ఒక నెల పాటు శాలరీ తీసుకోకుండా వర్క్ చేస్తానని చెప్పుకొచ్చింది. నా పని విధానం గమనించండి.
నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ లేకుండా ఉద్యోగం నుంచి తొలగించండి అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఈ పోస్టు నెట్టింటా వైరల్ గా మారింది. ఈ పోస్టును బట్టి చూస్తే విదేశాల్లో భారతీయ విద్యార్థుల కష్టాలు కల్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఫ్యూచర్ కోసం ఫారిన్ వెళితే అక్కడ కూడా ఉద్యోగాలు కరువవ్వడంతో యువత నిరాశలో కూరుకుపోతుంది. విదేశాల్లో చదివితే మంచి ఉద్యోగం, గొప్ప ఫ్యూచర్ ఉంటుందని ఆశపడే స్టూడెంట్స్ ను ఈ పోస్ట్ నిరాశపరుస్తోంది. ఫారిన్ వెళ్లాలనుకునే వారికి ఈ ఘటన అలాంటి ఆలోచనను విరమించుకునేలా చేస్తోంది. మరి జాబ్ ఇస్తే చాలు శాలరీ తీసుకోకుండా పనిచేస్తాను అన్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.