iDreamPost
android-app
ios-app

అబార్షన్ టాబ్లెట్స్ ఎగబడి కొంటున్న మహిళలు.. అమెరికాలో ఏం జరుగుతోంది?

  • Published Nov 13, 2024 | 3:55 PM Updated Updated Nov 13, 2024 | 3:55 PM

Donald Trump: అమెరికాలో దేశ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన ఘన విజయం సాధించారు.

Donald Trump: అమెరికాలో దేశ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన ఘన విజయం సాధించారు.

అబార్షన్ టాబ్లెట్స్ ఎగబడి కొంటున్న మహిళలు.. అమెరికాలో ఏం జరుగుతోంది?

ప్రపంచంలో పురాతన ప్రజాస్వామిక వ్యవస్థ అయిన అమెరికాలో దేశ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి, డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన ఘన విజయం సాధించారు. ప్రజల ఓట్లు అత్యధికంగా ట్రంప్ కే లభించాయి. 2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని మహిళలు అబార్షన్ టాబ్లెట్స్ ఎగబడి కొంటున్నారు. అదేంటీ ట్రంప్ గెలుపు.. అబార్షన్ టాబ్లెట్స్ కొనుగోళ్లకు సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? అసలు అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలో ఇప్పుడు ఓ వింతైన పరిణామం చోటు చేసుకుంది. అబార్షన్ మెడిసన్స్ కొనుగోలు విపరీతంగా పెరిగిపోయాయి.  అమెరికాలో 2022 నుంచి అబార్షన్ చట్ట విరుద్దంగా పరిగణించబడింది. 2019 లో బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లో అబార్షన్ నిషేధించింది. 2024 ఎన్నికల సమయంలో ట్రంప్ తాను అధికారంలోకి వస్తే అబార్షన్ నిషేదాన్ని ఎత్తివేస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ట్రంప్ గెలిచాడు.. మరో రెండు నెలల్లో 47 వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో యునైటెడ్ స్టేట్స్ మొత్తంగా గర్భనిరోధక మాత్రలు, అబార్షన్ మెడిసన్స్ ముందస్తుగానే కొనుగోలు చేస్తున్నారు మహిళలు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అబార్షన్ టాబ్లెట్స్ సరఫనాలో భారీగా డిమాండ్ పెరిగిందని అతి పెద్ద కంపెనీ ఎయిర్ యాక్సెస్ చెబుతుంది. ట్రంప్ విజేతగా ప్రకటించిన 24 గంటల్లోనే అబార్షన్ పిల్స్ కోసం 10 వేల ఆర్డర్లు వచ్చాయట. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

సాధారణ రోజువారీ అమ్మకాల కంటే ఇది 17 రెట్లు ఎక్కువ అని అంటున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అబార్షన్ టాబ్లెట్స్ కోసం గర్భిణీలతో పాటు గర్భం దాల్చని వారు కూడా ఎగబడుతున్నారట. గర్భం రాని మహిళలు ముందుగానే ప్రిస్కిప్షన్ కోసం డాక్టర్లను సంప్రదిస్తున్నట్లు ఓ ఎన్జీవో తెలిపింది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్బిణీలు కానివారే ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. ఎన్నికలకు ముందే అబార్షన్ టాబ్లెట్స్ ఎక్కడ లభిస్తాయి అన్న విషయం తెలుసుకునేందుకు రోజూ 4 వేల నుంచి 4500 మంది తమ వెబ్ సైట్ చూసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ గెలిచారన్న వార్త విన్న తర్వాత ఆ సంఖ్య అమాంతం పెరిగి 82 వేలకు చేరిందని స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ట్రంప్ ప్రెసిడెన్సీ లో ప్రజలు ఆశించే అబార్షన్‌పై నిషేదం ఎత్తి వేస్తారని అందుకు సిద్దమవుతున్నట్లు ఇది సంకేతమని ప్లాన్ సి సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే అమెరికాలో అబార్షన్‌ టాబ్లెట్స్ ముందుగానే కొని దాచుకోవడం ఇక్కడి వారికి కొత్తేమే కాదట. 2022 మే నెలలో కూడా అబార్షన్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకువస్తారనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో అబార్షన్ టాబ్లెట్స్ డిమాండ్ 10 రెట్లు అమాంతం పెరిగిపోయిందని స్థానికులు వెల్లడించారు. మరి మహిళలకు ఇచ్చిన మాట ట్రంప్ నిలబెట్టుకుంటారా? లేదా అన్నది ముందు ముందు చూడాలి.