iDreamPost
android-app
ios-app

చంద్రబాబు జైలుకు పంపే ప్లాన్‌ చేశారా..? వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే షాకింగ్‌ కామెంట్స్‌

  • Published Feb 05, 2020 | 3:28 PM Updated Updated Feb 05, 2020 | 3:28 PM
  • Published Feb 05, 2020 | 3:28 PMUpdated Feb 05, 2020 | 3:28 PM
చంద్రబాబు జైలుకు పంపే ప్లాన్‌ చేశారా..? వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే షాకింగ్‌ కామెంట్స్‌

చంద్రబాబు యువతను రెచ్చగొడుతున్నారట. అమరావతి కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారని, ఆయన మాటలు నమ్మితే నట్టేట మునగడం ఖామంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌. కమ్మ వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే చంద్రబాబు అమరావతి ఉద్యమ సభలు పెడుతున్నారని ఈ తెనాలి ఎమ్మెల్యే షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

ఒక్క రోజు జైలుకెళ్లినా ఫర్వాలేదంటూ.. చంద్రబాబు కమ్మ సామాజిక వర్గ యువత జీవితాలను నాశనం చేసేలా రెచ్చగొడుతున్నారని శివకుమార్‌ మండిపడ్డారు. తన కుమారుడు లోకేష్‌ను జైలుకు పంపమంటే.. చంద్రబాబు పంపుతారా..? అని ప్రశ్నించారు. కమ్మ సామాజికవర్గ ప్రజా ప్రతినిధిగా మన మంచి కోసం చెబుతున్నా.. చంద్రబాబు మాయలో పడొద్దు. ఆయన మాటలు నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ.. ఎమ్మెల్యే శివకుమార్‌ విజ్ఞప్తి చేశారు.

కాగా, నిన్న మంగళవారం ప్రతిపక్ష నేత చంద్రబాబు తెనాలిలో అమరావతి ఉద్యమ సభ నిర్వహించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడారు. రాజధాని కోసం పోరాడాలంటూ యువతను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే అయిన అన్నాబత్తుని శివకుమార్‌.. ఈ రోజు ప్రెస్‌మీట్‌ పెట్టి బాబుపై ఫైర్‌ అయ్యారు.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom