iDreamPost
android-app
ios-app

భార్యకు మెసేజ్ కామెంట్లతో టార్గెట్ అయిన లోకేష్

భార్యకు మెసేజ్ కామెంట్లతో టార్గెట్ అయిన లోకేష్

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలంటే సీఎం జగన్ అనుమతి తీసుకోవాలేమో అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు. భర్త భార్యకు మెసేజ్ పెట్టాలన్నా భయపడాల్సి వస్తుందని లోకేష్ విమర్శించారు. లోకేష్ విమర్శలకు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు.

లోకేష్ కామెంట్స్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. లోకేష్.. సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నారని గుర్తు చేశారు. ‘అవునా.. తీసుకుంటున్నావా.. ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?!’ అంటూ మండిపడ్డారు.

మంత్రి వెల్లంపల్లి కూడా లోకేష్ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. లోకేష్ తన భార్యకు మెసేజ్ పెట్టే సమయంలో జగన్‌‌కు చెప్పే పెడుతున్నారా అని ప్రశ్నించారు. మీరు మీ భార్యకు నేరుగా మెసేజ్‌లు పెట్టుకోవచ్చు. మిగతావాళ్లు పెట్టాలనే జగన్‌ పర్మిషన్‌ కావాలంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో..సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో గతంలో హైదరాబాద్‌లో అరెప్ట్‌ చేసినవారిని ఎన్నెన్ని జిల్లాలు తిప్పారో గుర్తు లేదా అని ప్రశ్నించారు.

కాగా, లోకేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నారు. లోకేష్ మాట్లాడిన వీడియో ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తలా తోక లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి నవ్వులపాలయ్యారు.