iDreamPost
iDreamPost
పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా హరిహర వీరమల్లు. షూటింగ్ సగమైనా అయ్యిందో లేదో తెలియదు కానీ గత అయిదారు నెలల గురించి కనీస అప్ డేట్స్ ఇవ్వడం లేదు. నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు క్రిష్ ఎవరూ ఓపెన్ అవ్వడం లేదు. హీరోయిన్ నిధి అగర్వాల్ సంగతి సరేసరి. కనీసం బయట కనిపించడం కూడా మానేసింది. అసలు వర్క్ ఎంతదాకా వచ్చింది ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదు సరే కనీసం 2023లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ కి టెన్షన్ తగ్గుతుంది. కానీ దానికన్నా ఎక్కువగా వినోదయ సితం రీమేక్ తాలూకు వార్తలు కొన్నిరోజులు హల్చల్ చేశాయి. కట్ చేస్తే ఇప్పుడు దాని సౌండ్ కూడా వినిపించడం మానేసింది
కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందుతున్న ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి జాప్యం జరగడం వల్ల నష్టం నిర్మాతకే కాదు అందులో నటిస్తున్న ఆర్టిస్టులకు కూడా ఉంటుంది. పోనీ క్యాన్సిల్ చేశారా అంటే అదీ లేదంటున్నారు. ఇది పూర్తయితే తన భవదీయుడు భగత్ సింగ్ మొదలుపెడదామని చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ నిరీక్షణ ఎంతకీ ఫలించడం లేదు. మరోవైపు జనసేన కార్యకలాపాల్లో పవన్ చాలా బిజీ అయ్యాడు. వీరమల్లు హెయిర్ స్టయిల్ ని కొద్దిరోజుల క్రితం మార్చేసుకున్నారు. మళ్ళీ ఆ రేంజ్ లో పెంచుతారో లేక ఇప్పట్లో వీరమల్లు పూర్తి కాదనే డౌటో ఏమో కానీ దీనికి సంబంధించిన సస్పెన్స్ కి వీలైనంత త్వరగా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వరసగా రెండు రీమేకులు అయ్యాక ఫ్యాన్స్ స్ట్రెయిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అందులోనూ హరిహర వీరమల్లుకి బాహుబలి రేంజ్ బిల్డప్ ఇవ్వడంతో అంచనాలు కూడా దానికి తగ్గట్టు భారీగా ఉన్నాయి. తీరా చూస్తే పరిస్థితి ఇలా ఉంది. అయినా ఇలా రెండు పడవల ప్రయాణం రిస్క్ అని తెలిసి కూడా పవన్ పదే పదే అదే బాట పట్టడం ఆశ్చర్యకరం. మరోవైపు దర్శకుడు క్రిష్ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. తన రచనతో నైత్ అవర్ విడుదలైపోగా త్వరలో అనసూయ ప్రధాన పాత్రలో కన్యాశుల్కంని తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారట. చూస్తుంటే ఈ వీరమల్లు తాలూకు గుట్టు ఇప్పట్లో వీడే అవకాశం దగ్గర్లో కనిపించడం లేదు.