iDreamPost
iDreamPost
నిన్న జరిగిన సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చెప్పిన గుడి ఉదాహరణ సందర్భానికి తగ్గట్టు ఉన్నప్పటికీ ఒక వర్గం బ్యాచ్ కి మాత్రం టార్గెట్ అయిపోయింది. థియేటర్లు దేవాలయాలని, ఇంట్లో పూజగది ఉందని గుళ్లకు వెళ్లడం మానుకోమని చెప్పిన ఎగ్జాంఫుల్ మీడియా నుంచి సైతం చప్పట్లు అందుకుంది. కాకపోతే ఇది కొత్తగా చెప్పిందేమీ కాదు. గతం రామ్ లాంటి హీరోలు వాడిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ అందులో నానార్ధాలు తీస్తూ ఆడో రకమైన ఆనందం పొందుతున్నారు. అయితే అందులో కూడా లాజిక్స్ ఉండటం ట్విస్ట్.
సినిమా హాళ్లను గుళ్ళతో పోల్చడం బాగానే ఉంది కానీ మరి అంత పవిత్రమైన వాటిని కాపాడాల్సిన కొందరు నిర్మాతలు త్వరగా ఓటిటికి ఇవ్వడం వల్లే కదా థియేటర్లకు రావడం లేదనేది కొందరి కామెంట్. ఒకవేళ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ఓటిటి రిలీజ్ కోసం ఆరు నెలల గ్యాప్ తరహా నిర్ణయాలు తీసుకునే సాహసం మనవాళ్ళు చేయగలరాని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కొన్ని సరదావి కూడా లేకపోలేదు. గుడిని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే తాము పదేపదే థియేటర్లకు వెళ్లడం లేదని ఇంకో నెటిజెన్ సెటైర్. ఇలా సీరియస్ గా కొన్ని కామెడీగా కొన్ని ఉన్నాయి. వీటి సంగతి పక్కనపెడితే ప్రభాస్ ని పాత లుక్ లో చూసిన ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు
ఏది ఎలా ఉన్నా ప్రభాస్ అందరూ సీతారామంని థియేటర్ లోనే చూడాలని చెప్పడం మాత్రం అర్థమయ్యింది. దీనికి ప్రాజెక్ట్ కె నిర్మాతలు ఒకరే కావడం వల్లే ఈ ఈవెంట్ కి అతిథిగా వచ్చాడనే మాటలో నిజమున్నప్పటికీ దుల్కర్ లాంటి హీరోలకు టాలీవుడ్ లో సపోర్ట్ దక్కాలంటే డార్లింగ్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది. అభిమానులకు అదుపు చేయలేమనే ఉద్దేశంతో కేవలం మీడియాను మాత్రమే అనుమతించడం వల్ల ఈవెంట్ సాఫీగా జరిగిపోయింది. మొత్తానికి ప్రభాస్ రాక వల్ల సీతారామంకు జరిగిన మేలు ఓపెనింగ్స్ పరంగా ప్లస్ అయ్యేలా ఉంది. బాగుందనే టాక్ తెచ్చుకుంటే చాలు మహానటి బ్యానర్ కి మరో హిట్టు దక్కినట్టే