iDreamPost
iDreamPost
ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ చివరి స్టేజిలో ఉన్న పవన్ కళ్యాణ్ దీని తర్వాత చేస్తున్న సినిమా మీదే అభిమానుల దృష్టి ఎక్కువగా ఉంది. కారణం భారీ చిత్రాల నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా దీన్ని రూపొందించడం. ఇప్పటికే దీని సెట్ తాలుకు ఫోటోలు కొద్దిరోజుల క్రితం ఐడ్రీం ఎక్స్ క్లూజివ్ గా అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని అప్ డేట్స్ అనఫీషియల్ గా చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం దీనికి ప్రాధమికంగా 150 కోట్ల బడ్జెట్ సెట్ చేసుకున్నారట. ఇప్పటిదాకా పవన్ కెరీర్ లో ఇంత ఖర్చు పెట్టిన సినిమా లేదు.
ఒకవేళ షూటింగ్ జరుగుతున్న టైంలో డిమాండ్ కు తగ్గట్టు అవసరమైతే అదనపు మొత్తం వెచ్చించడానికి రత్నం సిద్ధంగా ఉన్నట్టు వినికిడి. మొఘల్ కాలంలో జరిగన పీరియాడిక్ డ్రామాలో పవన్ దొరలను దోచి పేదలకు పంచే రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. క్రిష్ ఈ ఏడాదే రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. ఎలాగూ ఇంకో నెల లోపు వకీల్ సాబ్ కు సంబంధించిన మొత్తం కార్యక్రమాలు పూర్తైపోతాయి కాబట్టి పవన్ పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తాడు. ఈ లోగా పాటల రికార్డింగ్ పూర్తి చేసి ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్ ప్లాన్ చేశారట.
తెలంగాణా యోధుడు పండగ సాయన్న కథగా దీని గురించి ప్రచారం జరుగుతోంది కాని ఏ విషయం ఇంకా బయటికి చెప్పడం లేదు. బాలీవుడ్ ఫేం జాక్వలిన్ ఫెర్నండేజ్, అర్జున్ రాంపాల్ ఇప్పటిదాకా ఖరారైన తారాగణంగా న్యూస్ గతంలోనే వచ్చేసింది. మిగిలిన క్యాస్టింగ్ ను కూడా వేగంగా సెట్ చేస్తున్నాడు క్రిష్. అన్ని అనుకున్నట్టు జరిగితే పవన్ 27 ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వస్తుంది కాబట్టి దీన్ని దానికన్నా ముందు లేదా ఆ తర్వాత ప్లాన్ చేయాలి. చిరంజీవి ఆచార్య, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లతో ఎలాంటి క్లాష్ రాకుండా జాగ్రత్త పడాలి. ఆ దిశగానే రత్నం, క్రిష్ లు క్లారిటీతో ఉన్నారట. బుర్రాసాయి మాధవ్ సంభాషణలు అందిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.