iDreamPost
సాయంత్రం అయిదు గంటలకే మొదలైన సందడి రాత్రి తొమ్మిది వరకు నిరాటంకంగా సాగిపోయింది.
సాయంత్రం అయిదు గంటలకే మొదలైన సందడి రాత్రి తొమ్మిది వరకు నిరాటంకంగా సాగిపోయింది.
iDreamPost
విశాఖలో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసి అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. సినిమా కథ సముద్రం నేపథ్యంలో రూపొందటం, వ్యక్తిగతంగా మెగాస్టార్ కు వైజాగ్ ఇష్టమైన నగరం కావడంతో వేదికను ఇక్కడ సెట్ చేశారు. సాయంత్రం అయిదు గంటలకే మొదలైన సందడి రాత్రి తొమ్మిది వరకు నిరాటంకంగా సాగిపోయింది. మొన్న ట్రైలర్ వచ్చాక ఈ చిత్రం మీదున్న అంచనాలు రెట్టింపయ్యాయి. కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీలో దర్శకుడు బాబీ దీన్ని తీర్చిదిద్దిన తీరు ఫ్యాన్స్ నే కాదు మూవీ లవర్స్ ని సైతం విపరీతంగా ఆకట్టుకుంది. యుట్యూబ్ వ్యూస్ లోనూ వ్యూస్ పరంగా వాల్తేరు వీరయ్యదే డామినేషన్ నడుస్తోంది.
తన ప్రసంగంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను చిరు స్వయంగా వివరించారు. మొదలైన అరగంటకే హాలీవుడ్ రేంజ్ లో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని, సెకండ్ హాఫ్ లో రవితేజ ఎంటరయ్యాక నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుందని, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి దాకా హ్యాపీగా ఎంజాయ్ చేయడంతో ఇది కదా మేం కోరుకున్న సినిమానేలా తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా ఉందని బాబీకి కితాబు ఇచ్చారు. రంగస్థలంతో మొదలైన తన చిరు లీక్స్ అలవాటుని కంట్రోల్ చేసుకున్న తీరు ఆహుతులను ఆకట్టుకుంది. విదేశాల్లో పాట షూట్ చేస్తున్నప్పుడు మైనస్ చలిలోనూ చీరకట్టుకుని సహకరించిన శృతి హాసన్ డెడికేషన్ గురించి ప్రస్తావించారు.
చిరంజీవే కాదు రవితేజ సైతం వాల్తేరు వీరయ్య మీద ఇదే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దీని విజయం మీద తనకు ఎలాంటి సందేహం లేదని, మళ్ళీ సక్సెస్ మీట్ లో ఎక్కువ మాట్లాడతానని చెప్పి చిరుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆజ్ కా గూండా రాజ్ లో స్నేహితుల గ్యాంగ్ లో ఒకడిగా నటించడంతో మొదలుపెట్టి ఇప్పుడు ఆయన సినిమాలో కీలక పాత్ర పోషించడం తన ఎదుగుదలలో ఆయన స్ఫూర్తి ఎంత ఉందో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇరవై ఏళ్ళ తర్వాత మెగాస్టార్ మాస్ మహారాజా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళ కాంబోలో 2000లో వచ్చిన అన్నయ్య సంక్రాంతికే వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన విషయం ఫ్యాన్స్ మర్చిపోలేరు