టిడిపి తరపున త్రిసభ్య కమిటి ఎందుకేశావు బాబూ ?

’వైజాగ్ ఆర్ఆర్ వెంకటాపురంలో గ్యాస్ లీకేజీ ప్రమాధంపై ప్రభుత్వంలో ఐఏఎస్ లతో కమిటి వేయటం ఏమిటి ? ఐఏఎస్ లకు ఏమి తెలుసు ? సబ్జెక్టు నాలెడ్జి ఉన్న నిపుణులతో కమిటి వేయాలి’ … ఇది చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లు. అంతా బాగానే ఉంది చంద్రబాబు చెప్పినట్లుగా ఐఏఎస్ లకు ఏమీ తెలీదనే అనుకుందాం కాసేపు. మరి ఇదే ప్రమాధంపై పార్టీ తరపున ముగ్గురు నేతలతో కమిటి ఎందుకు వేసినట్లు ? మాజీ మంత్రులు, అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడుతో నిజనిర్ధారణ కమిటి వేసినట్లు చంద్రబాబు ప్రకటించటమే విచిత్రంగా ఉంది.

ప్రభుత్వం నియమించిన కమిటిని తప్పు పడుతున్న చంద్రబాబు మరి తాను నియమించిన కమిటిలో సభ్యులు మాత్రం ఎందులో నిపుణులో చెప్పగలడా ? టిడిపి తరపున నియమితులైన ముగ్గురు నేతలు ఫక్తు రాజకీయ నేతలు మాత్రమే. వీళ్ళల్లో ఎవరికి కూడా సబ్జెక్టు నాలెడ్జి ఉండే అవకాశం లేదు కాగ లేదు. మరి వీళ్ళతో కమిటి వేసి చంద్రబాబు ఏమి సాధించాలని అనుకుంటున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.

చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాధాల్లో ఏనాడు నిపుణులతో కమిటి వేయలేదు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయిన ఘటనలో చివరకు సిసి ఫుటేజీని కూడా మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. తర్వాత కృష్ణానదిలో విజయవాడ దగ్గర బోటు ప్రమాధం జరిగినపుడు 27 మంది చనిపోతే నిపుణుల కమిటి లేదు విచారణ లేదు. పై రెండు ప్రమాధాల్లో చనిపోయిన వారి కుటుంభాలకు అడిగినంత నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. పై ప్రమాధాల్లో డిపార్ట్ మెంటు అధికారులతోనే విచారణ చేయించి కేసును మూయించేశాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నాడో, ఏమి చేస్తున్నాడో బహుశా తనకే అర్ధం కావటం లేదేమో. గ్యాస్ లీకేజీ ప్రమాధంపై ప్రభుత్వం నిపుణులతో కమిటి వేయాలని ఒకవైపు డిమాండ్ చేస్తునే మరోవైపు ముగ్గురు నేతలతో కమిటి వేయటంలో అర్ధమేంటి ? పార్టీ తరపున నిపుణులతో చంద్రబాబు ఓ కమిటిని వేస్తే ఎవరైనా అడ్డుకుంటారా ? జరిగిన ప్రమాధంపై తాను ఇప్పటికే అనేకమంది నిపుణులతో మాట్లాడినట్లు చెప్పుకున్నాడు. అలాంటపుడు అదే నిపుణులతో కమిటిని ఎందుకు వేయలేదు?  మొత్తానికి చంద్రబాబు చెప్పే మాటలకు చేతలకు సంబంధం లేకుండా పోయిందనేందుకు ఇదే తాజా నిదర్శనం

Show comments