iDreamPost
android-app
ios-app

జగన్.. చంద్రబాబు.. జయలలిత విషయంలో ఎవరు చెప్పింది నిజం..?

జగన్.. చంద్రబాబు.. జయలలిత విషయంలో ఎవరు చెప్పింది నిజం..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనమండలి ఆవశ్యకత పైన, అసెంబ్లీ లో ఆమోదించిన బిల్లులను శాసన మండలిలో అడ్డుకోవడం పైన అసెంబీలో చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలో అసలు రాజధాని గురించి ప్రస్తావనే లేదని, దాని స్థానంలో పాలనా స్థానం అని మాత్రమే ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రే పాలనాధిపతి, సచివాలయానికి కూడా ముఖ్యమంత్రి పాలనాధిపతిగా ఉంటారన్నారు. పారిపాలనా దృష్యా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ నుండే పరిపాలన జరుగుతుందన్నారు. దీనికి ప్రత్యేకంగా ఏ చట్టం, బిల్లు తో పనిలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిపాలన వికేంధ్రీకరించే స్వేచ్చ ప్రభుత్వానికి ఉందని, గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె సంవత్సరంలో సగం రోజులు ఊటీలో ఉంటే రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు అంతా అక్కడనుండి జరిగేవని, గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్ హుద్ తుఫాను సమయంలో పది రోజుల పాటు విశాఖ పట్టణంలోనే ఉన్నాడని, ఆ సమయంలో చంద్రబాబు అక్కడ నుండే పరిపాలన కొనసాగించారని గుర్తు చేశారు. రాజ్యంగంలో 174 వ నిబంధన ప్రకారం పరిపాలన, చట్టాలను ఎక్కడినుండైనా చెయ్యవచ్చని, అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడుకి ఇంత నాటకాలు అవసరమా అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకులు నైతికవిలువలకి కూడా తిలోదకాలిచ్చి రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: నెచ్చెలి ఆస్తులకు వారసురాలిని నేనే..

అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడినవన్నీ అబద్దాలేనని ఆరోపించారు. రాజ్యాంగంలో రాజధాని అన్న పదమే లేదనడం అబద్దమని అన్నారు. అయితే ఈ సందర్భంగా జయలలిత విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు జయలలిత ఊటీ నుండే పరిపాలించారని ముఖ్యమంత్రి మాట్లాడడం అబద్దమని, ఆమె కేవలం విశ్రాంతి కోసమే ఊటీ వెళ్లేవారనన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయపరమైన విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కాసేపు పక్కన పెడితే సభలో జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టు జయలలిత అధికారంలో వున్నప్పుడు నిజంగా ఊటీ నుండే తన పాలన కొనసాగించేవారా ?? లేదా చంద్రబాబు చెప్తున్నట్టు కేవలం ఆమె విశ్రాంతి కోసమే ఊటీ కి వెళ్ళేవారా ?? ఇంతకీ ఈ రెండు వాదనల్లో ఏది నిజం ఏది అబద్దామో తెలుసుకోవాలంటే.. దీనికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. తమిళనాడు వారిని ఎవరిని అడిగినా.. తమిళనాడులో ఉన్నరాజకీయాలు తెలిసిన తెలుగువారిని ఎవరిని అడిగినా ఈ విషయాన్ని చెప్తారు. లేదా జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి దిన పత్రికలు చుసినా అర్ధమౌతుంది. ఇంతకీ వాస్తవం ఏంటంటే..

అసలు జయలలిత పేరు ప్రస్తావన వచ్చినప్పుడు మొదట గుర్తొచ్చేది ఆమెకు ఊటీ దగ్గరలోని కొడనాడులో ఉన్న విలాసవంతమైన టీ ఎస్టేటే. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ప్రకృతి సౌందర్యాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో షుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఖరీదైన ఈ కొడనాడు ఎస్టేటు వుంది. 1990 ప్రాంతంలో ఆమె ఏంతో ఇష్టపడి ఈ ఎస్టేట్ ని ప్రయివేట్ వ్యక్తులనుండి కొనుగోలు చేశారు. ఎస్టేట్ పరిధిలో ఉన్న సరస్సుపై పడవ యాత్రలు చేయడం, బంగ్లాలో గడపడం ఆమెకు చాలా ఇష్టం. సచివాలయంలో లాగా కేవలం జయలలిత ఒక్కరే తన బంగ్లాలోకి రావడానికి పోవడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని ఉపయోగించేవారు.

Read Also: పథకాలు.. పేర్లు.. చంద్రబాబు బాటలో పయనిస్తున్న జగన్‌

1990 తరువాతి కాలంలో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జయలలిత జీవితాన్ని, ఈ కొడనాడు ఎస్టేటుని విడదీసి చూడలేమేమో అన్నంతగా ఆమె జీవితంలో ఈ ఎస్టేట్ ఒక భాగమైంది అనే మాట వాస్తవం. ఎప్పుడు అవకాశం వచ్చినా ఆమె ఈ ఎస్టేటులోనే గడపడానికే ఎక్కువ ఇష్టపడేవారు. ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో అయితే జయలలిత సంవత్సరంలో ఎక్కువ రోజులు ఈ ఎస్టేటులోనే గడపడానికి ఇష్టపడేవారు. ఆ సమయంలో ఆమె పార్టీ కార్యక్రమాలకు, పార్టీ ముఖ్యనేతలకు కూడా అందుబాటులో ఉండేవారు కాదంటే అతిశయోక్తి కాదు.

ఆమె అధికారంలోకి ఉన్న సమయంలో అయితే కొడనాడ్ టి ఎస్టేట్ లో వ్యవహారాలు చూస్తే అది తమిళనాడు యొక్క ‘తాత్కాలిక సచివాలయం’ లా ఉండేది. వేసవిలో షుమారు నాలుగైదు నెలలు పాటు జయలలిత ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ నుండే తన పరిపాలనను కొనసాగించేవారు. మంత్రివర్గ సమావేశాలతో పాటు ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగులు కూడా ఆమె ఈ ఎస్టేట్ నుండే నిర్వహించేవారు. చీఫ్ సెక్రటరీ, డిఐజి తో సహా అధికార యంత్రాంగం అంతా చెన్నై నుండి ఈ ఎస్టేట్ కి వచ్చి కీలక ఫైళ్ల మీద సంతకాలు పెట్టించుకోవడం, విధానపరమైన నిర్ణయాలలో ఆమె అనుమతులు తీసుకోవడం చేసేవారు. ఆఖరికి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తమిళనాడు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కూడా ఆమె ఈ ఎస్టేట్ నుండే రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించడం విశేషమని చెప్పవచ్చు.

Read Also: వైఎస్‌ మంచోడు.. నాకు గౌరవం ఇచ్చేవాడు..

ఇదే తరహాలో దేశంలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసినప్పుడు, కమ్యూనిస్ట్ పాలిత రాష్ట్రాలకి చెందిన ముఖ్యమంత్రులు పార్టీ కార్యక్రమాలు, పార్టీ మహాసభలు, పార్టీ శిక్షణ తరగతులు జరిగే సమయంలో కొన్ని రోజుల పాటు దేశంలో ఎక్కడ ఉంటే అక్కడనుండే తమ రాష్ట్రానికి సంబందించిన పాలనా వ్యవహారాలన్నీ పర్యవేక్షించే వారు. అదే రీతిలో బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వ్యవహరించేవారు.

ఒకపక్క వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే గురువారం జగన్ మోహన్ రెడ్డి గతంలో జరిగిన ఈ విషయాలన్నింటిని సభదృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని అర్ధమౌతుంది. అయితే రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రబాబు మాత్రం ప్రతి విషయాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నంలో జయలలిత విషయంలో కూడా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని చెప్పక తప్పదు.