iDreamPost
android-app
ios-app

బంగార్రాజు ఎప్పుడు దిగుతాడో

  • Published Feb 28, 2020 | 6:04 AM Updated Updated Feb 28, 2020 | 6:04 AM
  • Published Feb 28, 2020 | 6:04 AMUpdated Feb 28, 2020 | 6:04 AM
బంగార్రాజు ఎప్పుడు దిగుతాడో

అక్కినేని నాగార్జున హిట్టు కొట్టి చాలా కాలమయ్యింది. ఎంతో హైప్ తో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న మన్మథుడు 2 దారుణంగా బోల్తా కొట్టడమే కాక కంటెంట్ విషయంలో తీవ్ర విమర్శలకు గురి కావడంతో అలెర్ట్ అయిన నాగ్ కొంచెం గ్యాప్ తీసుకుని మరీ వైల్డ్ డాగ్ చేస్తున్నాడు. స్వచ్ఛమైన ఇంగ్లీష్ లో ఉన్న టైటిల్ మాస్ కు వెంటనే కనెక్ట్ అయ్యేలా లేకపోయినా సబ్జెక్టు పోలీస్ కు సంబంధించిన కథ కాబట్టి ఇదే యాప్ట్ గా ఉంటుందని ఫిక్స్ అయ్యారని ఇన్ సైడ్ టాక్. ఇది వేసవిలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఎప్పటి నుంచో ఊరిస్తున్న బంగార్రాజు ఎప్పటి నుంచి తెరకెక్కుతుందనే సమాచారం మాత్రం ఇప్పటిదాకా రాలేదు. సోగ్గాడే చిన్ని నాయనా వచ్చి నాలుగేళ్లు దాటింది. దానికి సీక్వెల్ గానో ప్రీక్వెల్ గానో చెప్పబడుతున్న బంగార్రాజు స్క్రిప్ట్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎప్పుడో పూర్తి చేసాడని టాక్ ఉంది కానీ సెట్స్ పైకి మాత్రం త్వరగా వెళ్లలేకపోయింది.

రవితేజతో చేసిన నేల టికెట్టు డిజాస్టర్ కావడం, సోదరుడి అకాల మరణం కళ్యాణ కృష్ణను బాగా డిస్టర్బ్ చేశాయి. అందులోనూ మొదట అనుకున్న కథ నాగ్ కు పూర్తి సంతృప్తి కలిగించలేదని అందుకే రిపేర్లు వగైరా చేసే లోపు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.

వాస్తవానికి కొన్ని నెలల క్రితం బంగార్రాజు ఎప్పుడు మొదలుపెట్టినా 2021 సంక్రాంతి బరిలో దింపాలని అనుకున్నారట. కానీ అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ లైన్ లోకి రావడంతో అంత ఈజీగా ఆ నిర్ణయానికి కట్టుబడలేరు. కాబట్టి షూటింగ్ వేగంగా చేయాలా వద్దా అనేది దాని మీదే ఆధారపడి ఉంటుంది. అసలే సీక్వెల్స్ కు టాలీవుడ్ కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో బంగార్రాజుకు ఆ ఇబ్బంది లేకుండా పూర్తి ఫ్రెష్ లైన్ తో తెరకెక్కిస్తారట. ఎలాగూ నాగ చైతన్యతో నాగార్జున కలిసి నటించే చిత్రం కాబట్టి క్రేజ్ విషయంలో భయపడాల్సిన పని లేదు. మరి త్వరలో అని వినపడుతున్న ఆ మాట బంగార్రాజు ఎప్పుడు నిజం చేస్తాడో వేచి చూడాలి

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetjojobetcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet