iDreamPost
android-app
ios-app

“స్టైరిన్”గ్యాస్ అంటే ఏమిటి? మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

“స్టైరిన్”గ్యాస్ అంటే ఏమిటి? మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

నేటి తెల్లవారుజామున ప్రమాదవశాత్తు విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన పీవీసీ గ్యాస్ పేరు “స్టైరిన్”.ఈ వాయువును ప్రపంచంలో తొలిసారిగా 1839లో జర్మన్ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ సైమన్ గుర్తించాడు.ఆయన ‘ అమెరికన్ స్వీట్ గమ్ ‘ అనే చెట్టు నుండి స్రవించే ద్రవంలో గుర్తించాడు. గాలికి గాని, క్రాంతికి గాని ఎక్స్ పోజ్ అయినప్పుడు మరియు దాని ఉష్ణోగ్రత పెంచినప్పుడు నెమ్మదిగా గట్టిపడి రబ్బరులా ఘన రూపంలోకి మారుతుంది. ఘన రూపంలోకి మారిన ఈ వాయువును సైమన్ ‘ స్టైరాల్ ఆక్సైడ్‌ ‘గా పిలిచాడు.గాలిలో త్వరగా కలిసిపోయి స్వీట్ స్మైల్ ను విడుదల చేసే ఈ సమ్మేళనం కాఫీ,బీన్స్, పీనట్స్, కోల్ థార్ వంటి వాటిలో ఉంటుంది.దీన్ని రబ్బరు సంబంధిత పరిశ్రమలలో విరివిగా వాడతారు.

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ కూడా వాడుతోంది.ఈ గ్యాస్‌పై విస్తృత పరిశోధనలు చేసిన మరో జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఆగస్ట్ హోప్‌మన్ 8 కార్బన్ పరమాణువులతో 8 హైడ్రోజన్ పరమాణువుల సమ్మేళనంగా గుర్తించి,1845లో ‘ C8H8 ‘అనే రసాయన ఫార్ములా సూచించాడు.

విశాఖ ప్రమాదంలో వాయువు రూపంలో లీక్ అయిన ఈ రసాయన సమ్మేళనము పీల్చిన వెంటనే మెదడుపై ప్రభావం చూపి అపస్మారక స్థితికి చేరుకుంటున్నారు.కిడ్నీ, శ్వాస సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులకు గురి చేస్తుంది.చర్మానికి తగిలినా, కంటికి తగిలినా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.గ్యాస్‌ పీల్చిన వారికి నరాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తలనొప్పి,వాంతులు, వినికిడి లోపం,తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

విష వాయువు ప్రభావానికి గురైతే వెంటనే సదరు వ్యక్తిని ఘటనా స్థలి నుంచి వేరే చోటుకు తీసుకెళ్లాలి. దుస్తులను విప్పేసి, శరీరం వేడిగా ఉండేలా చూడాలి. శ్వాస ఆడకపోతే వైద్య చికిత్సకు తరలించాలి.కంటికి తగిలిన వెంటనే మంచి నీళ్లతో పది నిమిషాల పాటు శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ వాంతులు వస్తే ఆపుకోకుండా చేసుకోవడం ద్వారా ఈ గ్యాస్ ప్రభావాన్ని కొంత మేర తగ్గించవచ్చని నిపుణులు తెలియజేశారు.