iDreamPost
android-app
ios-app

పవన్ మహేష్ లు ఏం చేయబోతున్నారు

  • Published Oct 02, 2021 | 5:48 AM Updated Updated Oct 02, 2021 | 5:48 AM
పవన్ మహేష్ లు ఏం చేయబోతున్నారు

ఆర్ఆర్ఆర్ విడుదల తేదీకి సంబంధించి గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం డిస్ట్రిబ్యూషన్ వర్గాలను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తోంది. జనవరి 7 లేదా 12 రావడం ఖాయమని, ఆ మేరకు రాజమౌళి అధికారక ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని న్యూస్ రావడంతో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అదే సీజన్ ని లాక్ చేసుకున్న సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ లు నేరుగా ఆర్ఆర్ఆర్ ని ఢీ కొట్టడం అంత సులభం కాదు. పైగా స్క్రీన్ కౌంట్ విషయంలో చాలా తేడాలు వస్తాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. అందుకే పునరాలోచనలో పడినట్టు తెలిసింది.

ఒకవేళ ఆర్ఆర్ఆర్ నిజంగానే సంక్రాంతి బరిలో దిగితే అప్పుడేం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అజిత్ వలిమై కూడా పోటీలో ఉన్న సంగతి మర్చిపోకూడదు. ఇదే జరిగితే ఈ రెండూ ఉగాదిని టార్గెట్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అప్పుడు ఏప్రిల్ 1 అనుకూలంగా ఉంటుంది. లాంగ్ వీకెండ్ తో పాటు అదనంగా సెలవు కూడా ఉంది. అయితే ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే మాత్రం జక్కన్న టీమ్ నుంచి అనౌన్స్ మెంట్ బయటికి రావాలి. బాలీవుడ్ లో ప్రకటనల వరద పారుతున్న సమయంలో ఏదో ఒకటి చెప్పమని నిర్మాత దానయ్య మీద చాలా ప్రెజర్ ఉంది. దానికి చెక్ పెట్టాలంటే తేల్చడం ఒక్కటే మార్గం.

ఎలా చూసుకున్నా మహేష్ పవన్ లు క్లాష్ అవ్వడం తప్పేలా లేదు. ఒకవేళ భీమ్లా నాయక్ నేను సంక్రాంతికి వచ్చే తీరతాను అంటే ఆర్ఆర్ఆర్ తో పటు రాధే శ్యామ్ ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలే పవన్ ది రీమేక్ మూవీ. కథేంటో అందరికీ తెలుసు. కేవలం పవర్ స్టార్ ని చూసేందుకే థియేటర్ కు రావాలి. అందుకే ఒకటికి రెండు సార్లు అలోచించి తలపడాల్సి ఉంటుంది. వీటికన్నా ముందు 6న గంగుబాయ్ కటివాడి వచ్చేస్తుంది. ఇలా బాక్సాఫీస్ వద్ద ఇంత వేడి రాజుకున్న తరుణంలో మరీ అవాంఛనీయమైన పోటీ వద్దని ఎగ్జిబిటర్లు కోరుకుంటున్నారు. చూడాలి ఈ రోజు లేదా రేపు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి

Also Read : చైతు సాయిపల్లవిల మేజిక్ పని చేస్తూనే ఉంది