ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక సంస్థల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఈ రోజు జరగబోతోంది. ఆయా పట్టణ పాలక సంస్థలకు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 14వ తేదీన వెల్లడైన 11 నగరపాలక సంస్థలు, 75 మున్సిపల్, నగర పంచాయతీల ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ విజయదుందుబి మోగించింది. 12 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగ్గా.. కోర్టు ఆదేశాల […]
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పలు చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. అందులోనూ ముఖ్యంగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో ఈ చిత్ర విచిత్రాలు చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా వస్తున్నా హిందూపురం మున్సిపాలిటీ వైసిపి కైవసం అయ్యింది. దీనికి తోడు ఈ మున్సిపాలిటీలో ఒకరికి కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మందికి ఒక్కఓటు కూడా పడలేదు. వారంత తమ ఓటును కూడా వేసుకోలేకపోవడం గమనార్హం. […]
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానిది విలక్షణమైన రాజకీయశైలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీ హయాయే నడుస్తోంది. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించడం సహజంగానే జరిగితుండేది. టీడీపీకి సహజ బలంగా పరిగణించే కమ్మ సామాజికవర్గం పట్టు ఈ నియోజకవర్గం, ముఖ్యంగా మండపేట పట్టణంపై ఎక్కువగా ఉండడంతో వారు లేదా వారి తరఫున పోటీలో నిలిచిన అభ్యర్ధులనే విజయం వరించేంది. దీంతో ఇతర పార్టీలు ఇక్కడ పట్టుకోసం అనేకానేక ప్రయత్నాలే […]
వార్ వన్‌సైడ్ అయ్యింది. ఫ్యాన్ జోరుకు ఎదురేలేకుండాపోయింది. వైఎస్సార్సీపీపై ఓటర్లు కురిపించిన ఓట్ల వర్షం ఉప్పెనగా మారి ఉత్తరాంధ్రలో టీడీపీని ఊడ్చిపారేసింది. ఇంతకాలం టీడీపీ కంచుకోటలుగా పేరున్న పట్టణాలన్నీ మూకుమ్మడిగా ఆ పార్టీని తిరస్కరించి వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికలు.. రెండేళ్ళ క్రితంనాటి సార్వత్రిక ఎన్నికలను మించి ఆదరించారు. అధికార పార్టీ ప్రభంజనంలో గ్రేటర్ విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు సైతం దాసోహమన్నాయి. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న […]
గ్రేటర్ విశాక పట్టణ ఫలితం ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తి పెంచుతోంది. ప్రాధాన పార్టీలు మాత్రం ఎవరికి వారు గెలుపై బయటకి ధీమాగా కనిపిస్తున్నా.. లోలోపల టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. భారీ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనే భయం నెలకొంది. అయితే చాలా మున్సిపాలిటీలో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉండడంతో విశాఖ, విజయవాడ, గుంటూరు మున్సిపాలీటీల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ గెలుపు ఎవరిది అన్నది తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది. స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రంగా […]
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఐదు గంటల కల్లా క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పలు చోట్ల ఇంకా పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 53.57 శాతం మేర పోలింగ్ నమోదైంది. అత్యధికంగా తూర్పుగోదావరిలో 66.25 శాతం, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 47.63 శాతం పోలింగ్ నమోదైంది. ఈ […]
ఓటు విలువను గుర్తుచేస్తూ ప్రతి ఒక్కరూ ఓటేయాలని పంచాయతీ ఎన్నికల సమయంలోనూ, తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. పట్టణ ఓటర్లు చైతన్యవంతులని, ఈ నెల 10వ తేదీన జరిగే పోలింగ్‌లో ఓటు వేయాలని సూచించారు. ఇలా పంచాయతీ ఎన్నికలు జరిగిన నాలుగు దశల్లోనూ చెప్పారు. అంతేకానీ పోలింగ్ వేళ ఓటర్లు ఏమి తీసుకెళ్లాలి..? ఏమి తీసుకెళ్లకూడదు..? అనే ముఖ్యమైన విషయాలు మాత్రం నిమ్మగడ్డ […]
ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో జరుగుతున్న ఎన్నికలు ఒక ఎత్తు అయితే, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు మరో ఎత్తు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కుమారుడు, మాజీ ఎమ్మెల్యే కౌన్సిలర్లుగా పోటీ చేస్తుండడం ప్రత్యేకమైన అంశం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్థన్ రెడ్డి, టీడీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలు వేర్వేరు వార్డుల్లో పోటీ చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ […]
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో పార్టీ గర్తులపై మున్సిపల్ పోలింగ్ జరుగుతుంది. అవసరమైన చోట ఈ నెల 13వ తేదీన రీ పోలింగ్ నిర్వహించి, 14వ తేదీన లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. పోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను యంత్రాంగం సిద్ధం చేసింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు […]