iDreamPost
android-app
ios-app

త్రిబాణధారి బార్బరిక్‌ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Oct 06, 2025 | 10:45 AM Updated Updated Oct 06, 2025 | 10:45 AM

త్రిబాణధారి బార్బరిక్‌ సినిమా రిలీజ్ కు ముందు దీనికి సంబంధించి చాలానే చర్చలు జరిగారు. రిలీజ్ తర్వాత కూడా సినిమాను ఎవరు సరిగా చూడలేదని డైరెక్టర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయినా సంగతి తెలియనిది కాదు. సో అప్పటినుంచి మూవీ న్యూస్ ఇంకాస్త వైరల్ అయింది.

త్రిబాణధారి బార్బరిక్‌ సినిమా రిలీజ్ కు ముందు దీనికి సంబంధించి చాలానే చర్చలు జరిగారు. రిలీజ్ తర్వాత కూడా సినిమాను ఎవరు సరిగా చూడలేదని డైరెక్టర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయినా సంగతి తెలియనిది కాదు. సో అప్పటినుంచి మూవీ న్యూస్ ఇంకాస్త వైరల్ అయింది.

  • Published Oct 06, 2025 | 10:45 AMUpdated Oct 06, 2025 | 10:45 AM
త్రిబాణధారి బార్బరిక్‌ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

త్రిబాణధారి బార్బరిక్‌ సినిమా రిలీజ్ కు ముందు దీనికి సంబంధించి చాలానే చర్చలు జరిగారు. రిలీజ్ తర్వాత కూడా సినిమాను ఎవరు సరిగా చూడలేదని డైరెక్టర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయినా సంగతి తెలియనిది కాదు. సో అప్పటినుంచి మూవీ న్యూస్ ఇంకాస్త వైరల్ అయింది. ఇలా అనేకరకాల సంఘటనలు ఈ సినిమా చుట్టూ జరిగాయి. ఇలా చర్చనీయాంశం అయినాయి సినిమా ఇప్పుడు ఓటిటి లోకి రాబోతుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ తన మనవరాలు నిధి కనిపించడం లేదని పోలీసులకు ఆశ్రయిస్తాడు. దీనిని కానిస్టేబుల్ చంద్ర డీల్ చేస్తాడు. ఇక మరోవైపు ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి రామ్ విదేశాల్లో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. దానికి కొంత డబ్బు అవసరం అవ్వడంతో కొన్ని అసాంఘీక పనులు చేస్తుంటాడు. దానికోసం కొంత అప్పు కూడా చేస్తాడు. అసలు ఈ ఇద్దరికీ సంబంధం ఏంటి ? ఒకరితో ఒకరికి ఏదైనా సంబంధం ఉందా ? ఆమెను కిడ్నప్ చేసింది ఎవరు ? తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 10 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఓటిటిలో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి