DV Raju
ప్రస్తుతం సినిమాల్లో ఓ ట్రెండ్ కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీదకు దేవుడ్ని పట్టుకొచ్చి కోట్లకు కోట్ల కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ ఇలా అన్ని చిత్రాల్లో దైవత్వం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ, కథనాన్ని సెట్ చేసి.. దానికి డివైన్ ఎమోషన్స్‌ను జోడించేస్తున్నారు. క్లైమాక్స్‌తో సినిమాను అలా నిలబెట్టేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాల్లో ఓ ట్రెండ్ కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీదకు దేవుడ్ని పట్టుకొచ్చి కోట్లకు కోట్ల కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ ఇలా అన్ని చిత్రాల్లో దైవత్వం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ, కథనాన్ని సెట్ చేసి.. దానికి డివైన్ ఎమోషన్స్‌ను జోడించేస్తున్నారు. క్లైమాక్స్‌తో సినిమాను అలా నిలబెట్టేస్తున్నారు.
DV Raju
ప్రస్తుతం సినిమాల్లో ఓ ట్రెండ్ కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీదకు దేవుడ్ని పట్టుకొచ్చి కోట్లకు కోట్ల కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ ఇలా అన్ని చిత్రాల్లో దైవత్వం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ, కథనాన్ని సెట్ చేసి.. దానికి డివైన్ ఎమోషన్స్‌ను జోడించేస్తున్నారు. క్లైమాక్స్‌తో సినిమాను అలా నిలబెట్టేస్తున్నారు. క్లైమాక్స్‌ని వేరే లెవెల్లో డిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. క్లైమాక్స్ బలంగా ఉండబట్టే ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వండర్లు క్రియేట్ చేశాయి.
ట్రైలర్‌లలో దేవుడి షాట్స్, భగవంతుడి ఆగమనానికి సంబంధించిన షాట్స్ పెట్టి అంచనాలు పెంచేస్తుండటం ఇప్పటి ట్రెండ్. ‘హనుమాన్’, ‘మిరాయ్’ ట్రైలర్లలో దేవుడు అడుగు పెట్టినట్టుగా చూపించారు. ఇక స్క్రీన్ మీద కూడా దైవాన్ని చూపించిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అలా మెస్మరైజ్ చేయడంతో సినిమా రిజల్ట్ కూడా మారిపోయింది. ఇక ఇప్పుడు అరి అనే ఓ చిత్రం అక్టోబర్ 10న రాబోతోంది. రీసెంట్‌గా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ఆరు పాత్రలు, వారి నేపథ్యం.. ఆ ఆరు కారెక్టర్లను కనెక్ట్ చేస్తే ఇంకో పాత్ర.. ట్రైలర్‌లో ఆ కృష్ణుడే నేల మీదకు దిగినట్టుగా పెట్టిన షాట్ చూసి అందరికీ గూస్ బంప్స్ వచ్చే ఉంటుంది.
మరి ఆ అరి షడ్వర్గాల కాన్సెప్ట్ ఏంటి? దర్శకుడు ఏడేళ్లుగా చేసిన పరిశోధన ఏంటి? ఈ చిత్రంతో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతోన్నారు? పురాణేతిహాసాల్లో అరి షడ్వార్గాల మీద చెప్పింది ఏంటి? వాటికి పరిష్కారం ఏంటి? అన్నది దర్శకుడు ఎలా చెప్పబోతోన్నాడు? అనే ఆసక్తిని అందరిలోనూ కలిగించారు. కృష్ణుడి మీద చేసిన ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్ అయితే ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో వినోద్ వర్మ, అనసూయ, సాయి కుమార్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా ఎంతో మంది గొప్ప ఆర్టిస్టులు నటించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్ సంగీతాన్ని అందించారు. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.