iDreamPost
android-app
ios-app

NTR దాదా సాహేబ్ ఫాల్కే మూవీ ఆగిపోయినట్టేనా !

  • Published Oct 07, 2025 | 1:56 PM Updated Updated Oct 07, 2025 | 1:56 PM

భారత సినీ పితామహుడు దాదా సాహేబ్ ఫాల్కే మీద .. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ సినిమాను నిర్మించాలని అనుకున్నాడు. ఇందులో ఫాల్కే గా జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. అది బాగా వైరల్ అయింది. పైగా అంతా దీనికి ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేయగలుగుతాడని అంతా స్ట్రాంగ్ గా నమ్మారు

భారత సినీ పితామహుడు దాదా సాహేబ్ ఫాల్కే మీద .. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ సినిమాను నిర్మించాలని అనుకున్నాడు. ఇందులో ఫాల్కే గా జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. అది బాగా వైరల్ అయింది. పైగా అంతా దీనికి ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేయగలుగుతాడని అంతా స్ట్రాంగ్ గా నమ్మారు

  • Published Oct 07, 2025 | 1:56 PMUpdated Oct 07, 2025 | 1:56 PM
NTR దాదా సాహేబ్ ఫాల్కే మూవీ ఆగిపోయినట్టేనా !

భారత సినీ పితామహుడు దాదా సాహేబ్ ఫాల్కే మీద .. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ సినిమాను నిర్మించాలని అనుకున్నాడు. ఇందులో ఫాల్కే గా జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. అది బాగా వైరల్ అయింది. పైగా అంతా దీనికి ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేయగలుగుతాడని అంతా స్ట్రాంగ్ గా నమ్మారు. ఓ రెండు మూడు రోజులు ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. ఇక అంతే ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు అంతా. ఇక ఇప్పుడు మరోసారి ఈ వార్తా వెలుగులోకి వచ్చింది.

ఈ సినిమాను మాక్స్ స్టూడియోస్ కు చెందిన వరుణ్ గుప్తాతో కలిసి, తన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ దీనిని నిర్మిస్తారని రాజమౌళి అనౌన్స్ చేశారు. దీనిని రాజమౌళి డైరెక్టర్ నితిన్ కక్కర్ కు అప్పగించారు. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. తారక్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాను హోల్ లో పెట్టినట్లు.. ఓ న్యూస్ ఎడిషన్ లో వచ్చిందట. అసలు ఈ సినిమా ఉన్నట్లు అటు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు.. ఇప్పుడు పోస్ట్ పోన్ అయినట్టు కూడా ఎలాంటి అప్డేట్ లేదు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత దేవర సిక్వెల్ ఉండనే ఉంది. రీసెంట్ గా దీనికి సంబందించిన అప్డేట్ కూడా వచ్చింది. సో దాదా సాహేబ్ ఫాల్కే మూవీ స్టార్ట్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. అయితే రాజమౌళి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ మూవీ ప్రకటన వచ్చిన సమయంలోనే ఆమీర్ ఖాన్ కూడా ఫాల్కేపై ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ప్రచారం జరిగింది. సో ఇప్పుడు దీనిని ఎవరు ముందు తెరకెక్కిస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.